వినాయక చవితితో హ్యాట్రిక్ పక్కా అంటున్న శృతిహాసన్

By iDream Post Sep. 01, 2021, 03:00 pm IST
వినాయక చవితితో హ్యాట్రిక్ పక్కా అంటున్న శృతిహాసన్

నటన,డాన్స్, సింగింగ్ తో రాణిస్తున్న కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ ఈ వినాయక చవితికి హ్యాట్రిక్ కొట్టాలని ఈగర్ గా వెయిట్ చేస్తుంది. తాను నటించిన క్రాక్, వకిల్ సాబ్ సినిమాలు పండగలకు విడుదలై హిట్ కొట్టడంతో తాజాగా వినాయక చవితి సందర్భంగా విడుదలకానున్న "లాభం" సినిమాతో కూడా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది శృతిహాసన్.

రవితేజ తో కలిసి నటించిన క్రాక్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి మంచి హిట్ టాక్ రావడంతో ఫుల్ జోష్ మీద ఉన్న శృతి హాసన్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన వకీల్ సాబ్ సినిమా కూడా ఉగాదికి రిలీజ్ అయి ప్రేక్షకులు ఆదరించడంతో డబుల్ జోష్ లో ఉంది.

ఇప్పుడు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో నటిస్తున్న "లాభం" సినిమాను కూడా తెలుగు, తమిళ్ లో ఒకేసారి వినాయక చవితి సెప్టెంబర్9న విడుదలకు సిద్ధం కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని శృతిహాసన్ భావిస్తోంది. తమిళ, తెలుగులో ఒకే పేరుతో విడుదల అవుతున్న ఈ సినిమాలో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ లో శృతిహాసన్ నటిస్తున్నట్టు గా తెలుస్తోంది. రైతు సమస్యల నేపథ్యంలో పోరాడే యువకునిగా విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి, ఉప్పెన సినిమాలలో విజయ్ సేతుపతి నటనకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ సేతుపతి కొత్త సినిమా "లాభం"ను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నారు. విలన్ గా జగపతిబాబు నటిస్తుండడం ఈ సినిమాకి కలిసొచ్చే మరోఅంశం.

గత రెండు సినిమాలు ఫెస్టివల్ సీజన్ లో విడుదలై హిట్ టాక్ కొట్టడంతో ఈ సారి కూడా హిట్ కొడతాననే అదే నమ్మకంతో ఉంది శృతిహాసన్. రిలీజ్ దగ్గర పడుతుంటే కొంత టెన్షన్ కి ఫీలవుతున్న శృతిహాసన్ ఈ వినాయకచవితి సీజన్ కూడా తనకి కలసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ప్రభాస్-శృతిహాసన్ సినిమా...

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీలో రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటుందట శృతిహాసన్. యాక్షన్ సన్నివేశాల్లో నటించే ఛాన్స్ ఎక్కువగా ఉండడంతో బాక్సింగ్, కత్తిసాములో శిక్షణ తీసుకుంటుంది.

Also Read: హాలీవుడ్ లో దీపికా పదుకొనె డబుల్ ధమాకా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp