కళ్లులేని యువకుడి జీవితంలో అలజడి

By iDream Post Aug. 23, 2021, 06:29 pm IST
కళ్లులేని యువకుడి జీవితంలో అలజడి

థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటిటి రిలీజులు కొనసాగుతున్నాయి. కొన్ని సెకండ్ వేవ్ లో చేసుకున్న ఒప్పందాలు కావడంతో వెండితెరపై వచ్చే అవకాశం లేక స్మార్ట్ స్క్రీన్లపైకి దూసుకొస్తున్నాయి. అందులో ఒకటి హాట్ స్టార్ లో రాబోతున్న మాస్ట్రో. ఈ ఏడాది రంగ్ దే, చెక్ రూపంలో రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో నితిన్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ఇచ్చి కృష్ణార్జున యుద్ధంతో చిన్న గ్యాప్ వచ్చిన మేర్లపాక గాంధీ దర్శకుడిగా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నితిన్ స్వంత ప్రొడక్షన్ లోనే మాస్ట్రో రూపొందింది. హిందీ బ్లాక్ బస్టర్ అందాధున్ కి ఇది అఫీషియల్ రీమేక్.

ఇందాక ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ ని దాదాపుగా ఫాలో అయినట్టే కనిపిస్తోంది. పియానో వాయించి జీవనోపాధి చేసుకునే ఓ యువకుడు(నితిన్)చూపు లేకపోయినా ఓ అమ్మాయి(నభా నటేష్)ప్రేమకు నోచుకుంటాడు. ఇలా జీవితం సాఫీగా సాగిపోతుండగా అప్పుడు ప్రవేశిస్తుంది ఓ కన్నింగ్ లేడీ(తమన్నా). ఫలితంగా అతగాడి మీద మర్డర్ కేసు పడుతుంది. ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్(జిస్సు సేన్ గుప్తా)కు దీనికి కనెక్షన్ ఉంటుంది. కొత్త మలుపులతో కళ్ళు లేని ఇతని లైఫ్ చిత్ర విచిత్రమైన మలుపులకు నోచుకుంటుంది. అవేంటో తెలియాలంటే సెప్టెంబర్ 9న హాట్ స్టార్ చూస్తే సరి

నితిన్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. హిందీలో టబు చేసిన పాత్రకు తమన్నా మంచి ఛాయస్ గానే కనిపిస్తోంది. స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉంది. నభకు పెద్ద స్కోప్ ఉన్నట్టు లేదు. సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ కు కీలకమైన రోల్ దక్కింది. మహతి స్వర సాగర్ సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం బాగా ఎలివేట్ అయ్యాయి. ప్రముఖ గాయని మంగ్లీకి ఇందులో పాత్ర దక్కింది. హర్షవర్ధన్, రచ్చ రవి తదితరులు ఇతర తారాగణం. అందాదున్ ఫ్లేవర్ ని ఆల్మోస్ట్ ఫాలో అయిపోయిన మేర్లపాక గాంధీ ఎలాంటి మార్పులు చేశాడో తెలియాలంటే సినిమా రిలీజ్ కావాలి. సెప్టెంబర్ 10కి టక్ జగదీష్ రావొచ్చని వార్తల నేపథ్యంలో మాస్ట్రో ఒకరోజు ముందే ఫిక్స్ కావడం విశేషం

Also Read : OTT వివాదానికి ప్రొడ్యూసర్ గిల్డ్ సమాధానం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp