ఆకాశమే మాదంటున్న వెండితెర గుంజన్

By iDream Post Aug. 01, 2020, 01:22 pm IST
ఆకాశమే మాదంటున్న వెండితెర గుంజన్

అందాలతార అతిలోకసుందరి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కొత్త సినిమా గుంజన్ సక్సేనా ఈ నెల 12న నేరుగా నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇది కార్గిల్ గర్ల్ గా పేరు పొందిన ఒక నిజ జీవిత మహిళా సాహసి బయోపిక్. సాధారణంగా సమాజంలో మహిళల పట్ల ఉండే వివక్ష పైలట్ కావాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు గుంజన్ సక్సేనాకు కూడా ఎదురయ్యింది.కష్టపడి డిఫెన్స్ క్యాంప్ దాకా వెళ్లినా అమ్మాయిననే ఒకే కారణంతో తనకు ఎదురైన అవమానాలు, కన్నీళ్లను తట్టుకుని మరీ కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ఎగతాళి చేసినవాళ్ళతోనే సెల్యూట్ కొట్టించుకుంది.

ఈ విజయ గాథనే సినిమాగా రూపొందించారు.; ట్రైలర్ ని బట్టి చూస్తే చాలా నిజాయితీగా మంచి ఎమోషన్స్ తో బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. శరణ్ శర్మ దర్శకత్వం నమ్మకాన్ని బలపరిచింది. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ పెట్టిన ఖర్చు విజువల్స్ ని అద్భుతంగా చూపిస్తోంది. లొకేషన్స్ సైతం చాలా న్యాచురల్ గా ఉండగా యుద్ధ సన్నివేశాలకు జాన్వీ కపూర్ తీసుకున్న కఠినమైన శిక్షణ బాగా ఉపయోగపడింది. ఇటీవలి కాలంలో బయోపిక్స్ చాలా వచ్చినప్పటికీ గుంజన్ సక్సేనా ప్రత్యేకంగా నిలవడం ఖాయం. ఇది స్పోర్ట్స్ డ్రామా తరహాలో ఒకే రకమైన భావోద్వేగం చుట్టూ సాగదు కాబట్టి మంచి యాక్షన్ వార్ ఎపిసోడ్స్ ని ఆశించవచ్చు .

జాన్వీ కపూర్ కెరీర్లో మొదటిసారి ఛాలెంజింగ్ రోల్ ని చేస్తోంది. అంచనాలు కనక నిలబెట్టుకుంటే తల్లికి తగ్గ వారసురాలిగా పేరు తెచ్చుకోవచ్చు. రెగ్యులర్ గ్లామర్ రోల్ కాకపోవడంతో అభిమానులు కూడా దీని మీద ప్రత్యేకమైన ఆసక్తి పెంచుకుంటున్నారు. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, స్టూడెంట్స్ కి ఎక్కువగా రీచ్ అయ్యే ఈ చిత్రాన్ని స్వతంత్ర దినోత్సవానికి మూడు రోజులు ముందు కానుకగా ఇస్తున్నారు. జాన్వీ తండ్రిగా పంకజ్ త్రిపాటి కీలక పాత్రను పోషించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా అమిత్ త్రివేదితో పాటు మరో ముగ్గురు పాటలు కంపోజ్ చేశారు. మొత్తానికి ఈ లాక్ డౌన్ పీరియడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంది డైరెక్ట్ రిలీజ్ అవుతున్న సినిమాగా గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ నే చెప్పుకోవచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp