రకుల్ రాక్షసి అని పిలిచే హీరో

By iDream Post May. 04, 2020, 04:54 pm IST
రకుల్ రాక్షసి అని పిలిచే హీరో

తొమ్మిదేళ్ల క్రితం కెరటం అనే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయిన చిన్న సినిమాతో పరిచయమై ఆనతికాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయి సౌత్ లోని టాప్ స్టార్లతో పాటు బాలీవుడ్ లోనూ ఆఫర్లు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైపర్ యాక్టివ్ గా ఉండే రకుల్ తో స్నేహం అంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ . అయితే తనకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు పది ఉన్నారట. వాళ్ళు సందీప్ కిషన్, నవదీప్, లక్ష్మి మంచు, రాశి ఖాన్నా, రెజినా, సాయి ధరం తేజ్, రవితేజ, రానా, అఖిల్, మంచు మనోజ్.

ఈ లిస్టులోనూ తనకు చాలా పర్సనల్ గా ప్రాణ స్నేహితురాలిగా భావించేది మాత్రం రెజినానే. ఒకే రూమ్ ని షేర్ చేసుకునేంత బాండింగ్ వీళ్ళ మధ్య ఉంది. షూటింగ్ ఉన్న టైంలో త్వరగా లేచే అలవాటున్న రకుల్ ని పది దాటితే కాని కళ్ళు తెరవని రెజినా బాగా బెదిరించేది. ఇలాంటి జ్ఞాపకాలు వీళ్ళ మధ్య చాలానే ఉన్నాయి. అన్నట్టు ఈ ఫ్రెండ్స్ అందరికి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సినిమాల విశేషాలతో పాటు ఇతరత్రా కబుర్లతో బాగానే కాలక్షేపం చేస్తారు. మిగిలినవాళ్ళతో కూడా స్నేహం ఇలాగే ఉంటుంది కాని రెజినాతో బంధం మాత్రం రకుల్ కి చాలా ప్రత్యేకం.

రకుల్ ప్రీత్ సింగ్ ని ఒక హీరో మాత్రం రాక్షసి అని పిలుస్తారు. ఆయనే మాస్ మహారాజా రవితేజ. రకుల్ లోని హైపర్ యాక్టివ్ నెస్, ఎనర్జీని చూసి తనను అలా పిలవడం అలవాటయ్యిందట. ఈ ఇద్దరూ కలిసి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ 2లో నటించిన సంగతి తెలిసిందే. బహుశా అప్పుడు జరిగిన సంఘటనలు కాబోలు. ఇలాంటివి రకుల్ చాలానే షేర్ చేసుకుంటోంది. గత కొంత కాలంగా రకుల్ కి టైం కలిసి రావడం లేదు. సూర్య ఎన్జికె, నాగార్జున మన్మధుడు 2 బాగా నిరాశపరిచాయి. ప్రస్తుతం హిందిలో చలో చలో, థాంక్ గాడ్ చేస్తున్న రకుల్ తెలుగులో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందబోయే చిత్రంలోనూ ఎంపికయ్యింది. తమిళ్ లోనూ రెండు సినిమాలు చేస్తున్న రకుల్ మరో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp