బాక్సాఫీస్ టెస్టులో గోపీచంద్ పెర్ఫార్మన్స్

By iDream Post Sep. 12, 2021, 06:30 pm IST
బాక్సాఫీస్ టెస్టులో గోపీచంద్ పెర్ఫార్మన్స్

ప్రేక్షకులు ఒక మాస్ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో సీటిమార్ వసూళ్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. టాక్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన ఆప్షన్ ఏదీ లేకపోవడం ఈ వీకెండ్ మొత్తం గోపీచందే కబడ్డీ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ఏపి రెండు చోట్ల మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఇవాళ ఆదివారం మొదటి రెండు రోజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. కాకపోతే అసలు పరీక్ష సోమవారం నుంచి ఉంటుంది. ఎక్కువ స్క్రీన్లలో విడుదల కావడం ఇప్పటికి ప్లస్ అయినప్పటికీ రేపటి నుంచి డ్రాప్ శాతం తక్కువగా ఉంటే గట్టెక్కే ఛాన్స్ పెరుగుతుంది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సీటిమార్ రెండు రోజులకు గాను సుమారు 4 కోట్ల 90 లక్షల దాకా షేర్ వచ్చిందని అంటున్నారు. అంటే గ్రాస్ 8 కోట్ల పైమాటే. ఇది చాలా పెద్ద మొత్తం. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత వసూలు కావడం అంటే మాములు విషయం కాదు. అయితే కరెక్ట్ ఫిగర్స్ అవునా కాదా అనే క్లారిటీ రావాల్సి ఉంది. పోటీలో ఏ సినిమా లేకపోవడం, గత వారం అంతకు ముందు వచ్చినవి ఫైనల్ రన్ కు వచ్చేయడం సీటిమార్ కు కలిసి వస్తోంది. తలైవి వీక్ టాక్ కూడా ఉపయోగపడుతోంది. కేవలం హాలీవుడ్ మూవీస్ నుంచే పోటీ ఉన్నప్పటికీ వాటి ప్రభావం నామ మాత్రమే

అటుఇటుగా 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన సీటిమార్ ఇంకా సగం కూడా చేరుకోలేదు. రేపటి నుంచి రెగ్యులర్ ఆడియన్స్ ఏ మేరకు దీని టర్న్ అవుతారనేది మున్ముందు లెక్కలను శాశించనుంది. రొటీన్ కథా కథనాలే అయినప్పటికీ ,మాస్ కి పైసా వసూల్ అనిపించేలా కొన్ని మూమెంట్స్, పాటలు ఉండటం సీటిమార్ కు ఈ రెస్పాన్స్ రావడానికి తోడ్పడింది. గత డిజాస్టర్ చాణక్య కన్నా ఎన్నో రెట్లు మెరుగా పెర్ఫర్మ్ చేస్తున్న సీటిమార్ ఇంకో వారం అంటే లవ్ స్టోరీ వచ్చే దాకా స్టడీగా ఉంటే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు బాక్సాఫీస్ కు కావాల్సింది ఇలాంటి ఉత్సాహమే. చూడాలి మరి ఎక్కడి దాకా వెళ్తుందో

Also Read : 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp