సినిమా ప్రేమికుల నిరీక్షణకు ముగింపు

By iDream Post Jun. 05, 2021, 01:30 pm IST
సినిమా ప్రేమికుల నిరీక్షణకు ముగింపు
ఇప్పటికే థియేటర్లు మూతబడి నలభై రోజులు కావొస్తోంది. కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతోంది. కేసులు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జన జీవనం మళ్ళీ సాధారణం అయ్యే పరిస్థితి త్వరలోనే రాబోతోంది. ఇప్పటికైతే లాక్ డౌన్, కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి కానీ ఇదంతా మహా అయితే ఇంకో పది రోజులేనని విశ్లేషకుల అంచనా.అంటే జూన్ మూడో వారం తర్వాత ఏ నిమిషమైనా పర్మిషన్లు రావొచ్చు. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం ఉంది. కరోనా కేసుల్లో ఇండియా వైడ్ రికార్డులు సృష్టించిన మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలో దశల వారీగా లాక్ డౌన్ ఎత్తేస్తూ అక్కడి ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది.

అక్కడి ముప్పై ఆరు జిల్లాల్లో సగం మినహాయించి మిగిలిన పద్ధెనిమిది డిస్ట్రిక్ట్స్ లో ఎలాంటి నిబంధనలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. మిగిలిన వాటికి కేసుల పర్సెంటేజ్ ని బట్టి సడలింపులు పెంచుతారు. ఇక్కడ చెప్పిన వాటిలో థియేటర్లు పూర్తిగా వంద శాతం కెపాసిటీతో నిర్వహించుకోవచ్చని అందులో పేర్కొన్నారు. సో ఈ లెక్కన చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అక్కడంత సీరియస్ గా సిచువేషన్ లేదు. పైగా జనం బయట రాకపోకలు బాగానే సాగిస్తున్నారు. ఉదయం సమయంలో ఎంత రద్దీ ఉన్నా కూడా కరోనా పాజిటివ్ కేసులు మునుపటిలా నమోదు కావడం లేదు.

కాబట్టి అతి త్వరలోనే సినిమా హాళ్లకు గ్రీన్ సిగ్నల్ రావడం ఖాయమని తేలిపోయింది. ఒకవేళ కొంత తటపటాయించినా మహా అయితే జూన్ ఆఖరుకంతా తెరుచుకోవడం పక్కా. అయితే ఎవరు ముందు సినిమాలు విడుదల చేస్తారన్నది మాత్రం సస్పెన్స్. జనాలు మునుపటిలా థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో లేకపోలేదు. అయితే ఆ భయం అక్కర్లేదు. మాల్సు, మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్లు వీటికి ధైర్యంగా వెళ్తున్న పబ్లిక్ ఒక్క థియేటర్ల విషయంలోనే భయపడతారని అనుకోవడానికి లేదు. అదే నిజమైతే కరోనా భయం ఇంకా ఉన్న టైంలోనే క్రాక్, మాస్టర్లు భారీ వసూళ్లు తెచ్చిన సంగతి మర్చిపోకూడదు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp