డార్లింగ్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్

By iDream Post Mar. 17, 2020, 11:52 am IST
డార్లింగ్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్

సాహో తర్వాత బాహుబలి తరహాలో ఎక్కువ రోజులు వెయిట్ చేయాలేమో అని దిగులు చెందుతున్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు దర్శకుడు రాధాకృష్ణ గుడ్ న్యూస్ ఇచ్చేశాడు. తన దర్శకత్వంలో యువి క్రియేషన్స్, కృష్ణంరాజు గారి స్వంత సంస్థ గోపికృష్ణ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ఫస్ట్ లుక్ అతి త్వరలో విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించేశారు. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీం అనుకున్న టైం కంటే త్వరగా తిరిగి రానుంది.

కరోనా భయాల నేపధ్యంలో ఎక్కువ రోజులు విదేశాల్లో షూటింగ్ చేసే పరిస్థితులు లేకపోవడంతో కాస్త కుదించి మరీ వేగంగా షూట్ ని పూర్తి చేశారట. బాలన్స్ సన్నివేశాలను హైదరాబాద్ లో సిచువేషన్ నార్మల్ అయ్యాక మొదలుపెట్టబోతున్నారు. దాని తాలుకు వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కూడా రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. ఫస్ట్ లుక్ త్వరలో అంటున్నారంటే సినిమా విడుదల ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే ఉంటుంది. అయితే ఆగస్ట్ 15 టార్గెట్ చేస్తారా లేక దసరాకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే కేజిఎఫ్ 2 పండగను టార్గెట్ చేసుకుని అక్టోబర్ 23ని లాక్ చేసుకుంది. మరోవైపు మెగాస్టార్ ఆచార్య ఆగస్ట్ వైపు చూస్తోంది. బాలకృష్ణ-బోయపాటి కాంబో మూవీ కూడా పైకి చెప్పడం లేదు కాని ఇంచుమిందు అదే సీజన్ నే లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ప్రభాస్ కూడా బరిలో దిగాలని నిర్ణయించుకుంటే డేట్ పక్కాగా ఫిక్స్ చేసుకోవడం బెటర్. సాహోని గత ఏడాది ఇదే తరహాలో ప్రకటించి రెండు వారాలు వాయిదా వేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడా పొరపాటు జరగకుండా యువి సంస్థ అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ సినిమాకు ఓ డియర్, రాధే శ్యాం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. టీం ఇంకా అధికారికంగా చెప్పాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp