కెజిఎఫ్ 2 అభిమానులకు శుభవార్త

By iDream Post Nov. 25, 2020, 07:42 pm IST
కెజిఎఫ్ 2 అభిమానులకు శుభవార్త

ఒక సౌత్ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ కూడా విపరీతంగా ఎదురు చూడటం బాహుబలి తర్వాత కెజిఎఫ్ కే జరిగిందనడంలో అబద్ధం ఏమి లేదు. అంతగా ఇది అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది. కన్నడ కంటే ఎక్కువగా హిందీ వెర్షన్ వసూళ్లు వచ్చాయన్న ట్రేడ్ లెక్కల్లో వాస్తవం లేకపోలేదు. ఇదిలా ఉండగా చాప్టర్ 2 మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా ఒకే క్రేజ్ సొంతం చేసుకుందీ యాక్షన్ వండర్. విడుదల ఎప్పుడు ఉంటుందాని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ నిర్మాతల నుంచి ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ లేదు.

తాజా సమాచారం మేరకు కెజిఎఫ్ షూటింగ్ ఫైనల్ పార్ట్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారట. హీరో యష్ తో పాటు కీలక తారాగణం రేపటి నుంచి ఇక్కడికి రాబోతున్నారని తెలిసింది. ఇందులో బాలీవుడ్ ద్వయం సంజయ్ దత్, రవీనా టాండన్ లతో పాటు మన రావు రమేష్ కూడా కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి షెడ్యూల్ లో ఎవరు ఉంటారనే సంగతి మాత్రం ఇంకా చెప్పలేదు. కొన్ని కీలకమైన సన్నివేశాలు మాత్రమే బాలన్స్ ఉన్నాయని, గోల్డ్ మైన్స్ కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ గతంలోనే పూర్తి చేశారు కాబట్టి ఇక అభిమానులు రిలాక్స్ అవ్వొచ్చని ఇన్ సైడ్ టాక్.

సో ఈ లెక్కన చూస్తే కెజిఎఫ్ చాప్టర్ 2 వచ్చే సంక్రాంతి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీక్వెల్ లో రాఖీ భాయ్ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు, శత్రువులను ఎలా ఎదురుకున్నాడు. ఇతన్ని కట్టడి చేయడానికి గవర్నమెంట్ వేసిన ఎత్తుగడ ఏంటి లాంటి అంశాలన్నీ ఇందులో ఉండబోతున్నాయి. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని బెంగళూర్ టాక్. అన్ని భాషల్లో కలిపి సుమారు మూడు వందల కోట్లకు పైగా బిజినెస్ ని చాప్టర్ 2 చేయబోతున్నట్టు ట్రేడ్ రిపోర్ట్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp