ఆహ్లాదంగా కనిపిస్తున్న 'గుడ్ లక్ సఖి'

By iDream Post Oct. 17, 2020, 03:30 pm IST
ఆహ్లాదంగా కనిపిస్తున్న 'గుడ్ లక్ సఖి'

మహానటితో తమిళం కంటే ఎక్కువగా తెలుగులోనే అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్ కొత్త సినిమా గుడ్ లక్ సఖి త్వరలో విడుదలకు సిద్ధం కాబోతోంది. విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ టీమ్ ఇవాళ తమ హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా చిన్న మేకింగ్ వీడియో వదిలింది. అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో కల్లాకపటం లేని గ్రామీణ యువతిగా కీర్తి సురేష్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఆది పినిశెట్టి మరో లీడ్ రోల్ లో కనిపించనుండగా జగపతి బాబు ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఈ విజువల్స్ లో వాళ్ళను కూడా హై లైట్ చేశారు.

స్పోర్ట్స్ టచ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన గుడ్ లక్ సఖిలోమంచి విలేజ్ డ్రామాని పొందుపరిచారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే ఓ అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎలా ఎదిగిందనే పాయింట్ మీద ఇది రూపొందుతోంది. న్యాచురల్ లుక్ లో కీర్తి సురేష్ ఎలాంటి మేకప్ హడావిడి లేకుండా చూడచక్కగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా ఆకట్టుకునే అంశాలు కనిపిస్తున్న గుడ్ లక్ సఖి మీద అంచనాలు బాగానే ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. త్వరలో ఆడియో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు

అయితే గుడ్ లక్ సఖి ఓటిటిలో వస్తుందనే టాక్ కొద్దివారాల క్రితం వినిపించింది కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో వచ్చే నెల ఏమైనా రిలీజ్ కు ప్లాన్ చేస్తారేమో వేచి చూడాలి. కానీ డీల్ ఆల్రెడీ అయిపోయిందని మంచి డేట్ కోసం సదరు డిజిటల్ సంస్థ ఎదురు చూస్తోందని మరో ప్రచారం కూడా జరిగింది. దీనికి సంబంధించి మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 1998లో హైదరాబాద్ బ్లూస్ అనే తెంగ్లీష్ సినిమాతో డెబ్యూ చేసిన నగేష్ కుకునూర్ స్ట్రెయిట్ గా పూర్తి స్థాయి తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. అంతకుముందువన్నీ హిందీ, ఇంగ్లీష్ లే. అందుకే గుడ్ లక్ సఖి మీద మూవీ లవర్స్ ప్రత్యేకమైన అంచనాలు పెట్టుకున్నారు

Video Link Here @ bit.ly/2FAzFY7

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp