బాలకృష్ణ 107 కోసం గ్లామర్ బ్యూటీ

By iDream Post Jun. 22, 2021, 06:30 pm IST
బాలకృష్ణ 107 కోసం గ్లామర్ బ్యూటీ

ప్రస్తుతం అఖండ పూర్తి చేయాల్సిన బాధ్యతలో ఉన్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత క్రాక్ ఫేమ్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అఖండకు మహా అయితే ఇంకో నెల రోజుల పని ఉంటుంది. ఆ తర్వాత ప్రమోషన్లు వగైరా అనుకున్నా ఇంకో రెండు వారాలు అంతే. వీలైనంత త్వరగా అదవ్వగానే దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో పాటు ఒంగోలు నేపధ్యాన్ని తీసుకుని చాలా మాస్ స్టైల్ లో గోపిచంద్ దీన్ని ప్రెజెంట్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పుడో లేటెస్ట్ అప్ డేట్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంది.

హీరోయిన్ గా ముందు శృతి హాసన్, త్రిష పేర్లు వినిపించాయి కానీ ఇప్పుడు బాల్ మెహ్రీన్ కోర్టు దగ్గర ఆగిందని సమాచారం. తను కూడా పాజిటివ్ గా స్పందించినట్టు వినికిడి. పెళ్ళయాక సినిమాలకు సెలవు చెప్పాలని ముందు నిర్ణయించుకున్న మెహ్రీన్ ఇంకా ఆఫర్లు వస్తూనే ఉండటంతో మళ్ళీ మనసు మార్చుకున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. ఎలాగూ కెరీర్ లాంగ్ రన్ లో ప్లాన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు బాలయ్య లాంటి సీనియర్ హీరోల సరసన నటించడం వల్ల వచ్చిన నష్టమేమి లేదు. పైగా మాస్ ఎంటర్ టైనర్ కాబట్టి ఏదో నాలుగు పాటలు పది సీన్లతో తన పాత్రకు పెద్దగా రిస్క్ ఉండకపోవచ్చు.

ఇదింకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికైతే వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకున్న గోపిచంద్ మలినేని ఇప్పుడు విలన్ వేటలో పడ్డాడు. అఖండకు శ్రీకాంత్ తో మేనేజ్ చేశారు కనక ఇప్పుడు మరో పవర్ ఫుల్ విలన్ అవసరం. సముతిరఖనిని రిపీట్ చేయొచ్చు కానీ క్రాక్ తో పోలిక వస్తే కష్టం. అందుకే బాలీవుడ్ సీనియర్ ని ఎవరినైనా క్యాస్టింగ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న ఈ సినిమాకూ తమనే సంగీతం అందించబోతుండటం విశేషం. అఖండ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మరో బాలయ్య మూవీ ఇలా పట్టేశాడన్న మాట.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp