వరుణ్ తేజ్ మూవీకి చిక్కులు

By iDream Post May. 14, 2021, 11:19 am IST
వరుణ్ తేజ్ మూవీకి చిక్కులు
కరోనా తాలూకు పరిణామాలతో పాటు ఇతరత్రా వ్యవహారాలు చాలా సినిమాలకు తలనెప్పిగా మారాయి. ఎప్పుడు కుదుటపడుతుందో అర్థం కాక ఇండస్ట్రీ మొత్తం తీవ్ర ఆందోళనలో ఉంది. విడుదల తేదీలు క్యాన్సిల్ అయ్యాయి. కొత్త డేట్లు ఎవరికీ తెలియవు. అసలు థియేటర్లు దగ్గరలో తెరుచుకునే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇది కనక ఖరారైతే గత ఏడాది కన్నా ఎక్కువ ఓటిటి ప్రభంజనం చూడటం ఖాయం. నిన్న రాధేకు వచ్చిన రెస్పాన్స్ చూసి జీ సంస్థ షాక్ అయ్యింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రొడక్షన్ పరంగా అంతర్గతంగా ఉన్న వ్యవహారాలు కొన్ని సినిమాలకు మరింత భారంగా మారాయి.

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న గని షూటింగ్ కి లాక్ డౌన్ కు ముందే పెద్ద బ్రేకులు పడ్డాయని ఫిలిం నగర్ లో గట్టి ప్రచారమే జరుగుతోంది. నిర్మాతలు అల్లు బాబీ, సిద్దుల మధ్య విభేదాలతో పాటు వరుణ్ స్క్రిప్ట్ లో కోరుకుంటున్న మార్పుల వల్ల అంతకంతా ఆలస్యం పెరిగిపోతోందని మాట్లాడుకుంటున్నారు. ఇది పుకారే కావొచ్చు. లేదా నిప్పు లేనిదే పొగరాదు తరహాలో తెరవెనుక ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకుని ఫిజికల్ గా కూడా చాలా మార్పులు తెచ్చుకున్నాడు. కెరీర్ బెస్ట్ అవ్వాలన్నదే అతని టార్గెట్.

కానీ జరుగుతున్న తతంగం పట్ల అసంతృప్తిగా ఉన్నాడని కొందరు అంటున్నారు. ఇది నిజమో కాదో కానీ వరుణ్ ఫ్యాన్స్ మాత్రం ఖంగారు పడుతున్నారు. జులై 30ని గతంలో రిలీజ్ డేట్ గా ప్రకటించారు కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. నిజానికి రాధే శ్యామ్ కూడా అదే తేదీని తీసుకున్నప్పుడు గని ఆల్మోస్ట్ డ్రాప్ అయినట్టే. ఇప్పుడు ఇంకే టెన్షన్ లేకుండా వాయిదా వేసుకోక తప్పలేదు. కానీ దర్శకుడు కిరణ్ మాత్రం అలాంటిదేమి లేదని ఊరికే ప్రచారం జరుగుతోందని తన సన్నిహితులతో అంటున్నట్టు తెలిసింది. ఏది ఎలా ఉన్నా గని చక్కగా షేప్ అవుట్ అయ్యి బయటికి వస్తే అదే చాలంటున్నారు ఫ్యాన్స్.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp