చరణ్ కన్నా ముందు బన్నీతో ?

By iDream Post Mar. 08, 2021, 02:44 pm IST
చరణ్ కన్నా ముందు బన్నీతో ?

సుమంత్ కి మళ్ళీ రావా రూపంలో డీసెంట్ కం బ్యాక్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో చేసిన జెర్సీ ఎమోషనల్ గా ఎంత సక్సెస్ అయ్యిందో చూశాం. కమర్షియల్ అద్భుతాలు చేయకపోయినా సబ్జెక్టులో ఉన్న ఇంటెన్సిటీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇటీవలే దీని హిందీ వెర్షన్ రీమేక్ ని షాహిద్ కపూర్ హీరోగా గౌతమే పూర్తి చేశాడు. ఈ ఏడాదే విడుదల కాబోతోంది. దీని తర్వాత ఎవరికి కమిట్ అవ్వని ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం రెండు ఆప్షన్ల వైపు గట్టిగా ట్రై చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ తో చేయొచ్చనే టాక్ ఎప్పటి నుంచో ఉంది కానీ అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చెప్పలేం.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు లైన్లోకి వచ్చింది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో చాలా బిజీగా ఉన్న బన్నీ ఇటీవలే చిన్న విరామం తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక తిరిగి సుక్కుతో జాయిన్ కాబోతున్నాడు. ప్రస్తుతం మిషన్ మజ్ను హిందీ మూవీ కోసం ముంబైలో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న తిరిగి వచ్చాకా మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. ఆగస్ట్ 13 విడుదల తేదీ ఇచ్చేశారు కాబట్టి ఆ డెడ్ లైన్ మీట్ అయ్యేందుకు సుక్కు టీమ్ గట్టిగానే కష్టపడుతోంది. వచ్చే నెల బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ ని రెడీ చేసే పనిలో సుకుమార్ తలమునకలై ఉన్నాడు

దీని తర్వాత కొరటాల శివతో అల్లు అర్జున్ ఓ సినిమా గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది పుష్ప కాగానే మొదలువుతుంది. ఆచార్య మేలో రిలీజయ్యాక శివ పూర్తిగా ఫ్రీ అవుతాడు. పూర్తిగా బన్నీ స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడం మీదే దృష్టి పెట్టబోతున్నారు. మరి గౌతమ్ తిన్ననూరికి ఆఫర్ ఇవ్వాలంటే ఇదయ్యాకే ఛాన్స్ ఉంటుంది. అతను అప్పటిదాకా వేచి ఉంటాడా అంటే చెప్పలేం. ఇప్పటిదాకా సాఫ్ట్ ఎమోషనల్ స్టోరీస్ మాత్రమే డీల్ చేసిన గౌతమ్ చరణ్, బన్నీ లాంటి వాళ్లకు ఎలాంటి కథలను తయారు చేశాడన్నది ఆసక్తికరంగా మారింది. అందులోనూ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత శంకర్ కు కమిటయ్యాడు కాబట్టి గౌతమ్ కు ఆ ఆప్షన్ తగ్గినట్టే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp