OTT Premiers : సినిమా ప్రేమికులకు చిన్నితెర వినోదం

By iDream Post Nov. 24, 2021, 04:30 pm IST
OTT Premiers : సినిమా ప్రేమికులకు చిన్నితెర వినోదం

బాక్సాఫీస్ గత రెండు వారాలుగా డల్ గానే సాగుతున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి రాబోతున్న ది లూప్, అనుభవించు రాజా లాంటి వాటి మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. టాక్ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప గట్టి వసూళ్లు ఆశించలేం. వీటి సంగతలా ఉంచితే రేపు ఎల్లుండి మాత్రం ఓటిటి రిలీజులు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. అందులో మొదటిది 'దృశ్యం 2'. ఫ్యామిలీ ఆడియన్స్ లో భారీ అంచనాలు మోస్తున్న ఈ థ్రిల్లర్ ని డైరెక్ట్ ఓటిటి ద్వారా ప్రైమ్ విడుదల చేస్తోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా మీనా, సంపత్ రాజ్, నదియా, నరేష్ లు ఇతర తారాగణం.

రజినీకాంత్ లేటెస్ట్ డిజాస్టర్ 'పెద్దన్న' 26 లేదా 29న సన్ నెక్స్ట్- నెట్ ఫ్లిక్స్ లో రానుందని ఇప్పటికే టాక్ ఉంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదు. నవీన్ చంద్ర, అవికా గోర్ లు అన్నా చెల్లెలుగా నటించిన 'బ్రో' మూవీ సోనీ లివ్ లో నేరుగా స్ట్రీమింగ్ కాబోతోంది. గతంలో థియేటర్ అనే ప్రచారం జరిగింది కానీ ఫైనల్ గా డిజిటల్ కే ఫిక్స్ అయ్యారు. సాయి తేజ్ నటించిన 'రిపబ్లిక్' రిలీజ్ టైంలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. జీ5 యాప్ లో తీసుకొస్తోంది. హాలీవుడ్ టైపు లో మొదటిసారి డైరెక్టర్ కామెంటరీతో కూడిన ఆడియోని దీనికి జోడించబోతున్నారు. ఇవాళ దీనికి సంబంధించిన ఈవెంట్ కూడా చేయబోతున్నట్టు సమాచారం. థియేటర్ లో అధిక శాతం ప్రేక్షకులు చూడలేదు కాబట్టి రెస్పాన్స్ బాగుండొచ్చు. యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ బయట కనిపించే వేడుక ఇదే అవ్వొచ్చు

ఆకాష్ పూరి 'రొమాంటిక్' ని ఆహా యాప్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఎంత హంగామా పబ్లిసిటీ చేసినా ఇదీ వెండితెర మీద ఆశించిన స్థాయికి చేరుకోలేదు. కాకపోతే మిస్ అయిన ఆడియన్స్ స్మార్ట్ స్క్రీన్స్ లో చూసే ఛాన్స్ అయితే పుష్కలంగా ఉంది. ఈ మూడు సినిమాలు 26నే వస్తాయి. హిందీ సినిమాలు చోరీ, దిల్ బేకరార్ లు కూడా సందడి చేయబోతున్నాయి. మొత్తానికి మూవీ లవర్స్ కి బోలెడు ఆప్షన్లు ఉండబోతున్నాయి. స్క్రీన్ మీద మిస్ చేసుకున్నామని ఫీలైనవాళ్లు హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని వీటిని ఎంజాయ్ చేయొచ్చు. క్రమంగా థియేటర్ రిలీజులతో పోటీ పడే స్థాయిలో ఓటిటి విడుదలలు చేరుకోవడం విశేషం

Also Read : Aamir Khan : లాల్ సింగ్ ది గ్రేట్ - క్షమాపణ కోరాడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp