Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సినిమాలు మొదలయ్యేది అప్పుడే

By iDream Post Nov. 07, 2021, 06:19 pm IST
Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సినిమాలు మొదలయ్యేది అప్పుడే

రెండు నెలల క్రితం ప్రమాదానికి గురైన హీరో సాయి తేజ్ క్షేమంగా కోలుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీపావళి పండగ సందర్భంగా మొత్తం ఫ్యామిలీ హీరోలతో కలిసి చిరంజీవి పోస్ట్ చేసిన గ్రూప్ ఫోటోతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి తిరిగి సాయి తేజ్ ఎప్పుడు షూటింగ్స్ లో పాల్గొంటాడా అనేదాని మీద ఉంది. మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న న్యూస్ మేరకు హీన పక్షం మరో మూడు నుంచి ఆరు నెలల మధ్య రెస్ట్ తీసుకుని ఆ తర్వాతే అతను సెట్స్ కు వస్తాడని అంటున్నారు. డిశ్చార్జ్ అయినప్పటికీ శరీరానికి ఇంకా విశ్రాంతి అవసరం కావడంతో తొందరపడొద్దని డాక్టర్లు చెప్పారట. చిరు కూడా అదే సలహా ఇచ్చినట్టు తెలిసింది.

ఇప్పటికిప్పుడు సాయి తేజ్ చివరి దశలో ఉన్న సినిమాలేవీ లేవు. ఆల్రెడీ రిపబ్లిక్ రిలీజైపోయింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దర్శకత్వంలో మొదలైన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ఇంకా పూర్తి స్థాయి చిత్రీకరణలోకి వెళ్ళలేదు కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. ఇంకా చాలా పెండింగ్ ఉంది కాబట్టి నెమ్మదిగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రకటనలకు సైతం తొందరేమీ లేదు. అందుకే వీటి గురించి ఆలోచించడం మానేసి సాయి తేజ్ కొన్నాళ్ల పాటు రిలాక్స్ కాబోతున్నాడు. ఈలోగా తనకు తగిన జోడీని వెతికి పెళ్లిని సెట్ చేసే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలిసింది.

ఇప్పుడు దొరికిన ఫ్రీ టైంని సాయి తేజ్ కొత్త కథలను వినేందుకు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు విడుదలైన సినిమాలను చూసేందుకు వాడుకోబోతున్నాడు. డాన్స్ పరంగా రాబోయే కొన్ని సినిమాల్లో పాత మెరుపులు చూసే అవకాశం లేనట్టే. బాడీకి స్ట్రెయిన్ ఇస్తే నొప్పి తిరబట్టే ఛాన్స్ ఉంది కాబట్టి సాఫ్ట్ మూమెంట్స్ తో నెట్టుకురాక తప్పదు. ఫిజికల్ గా కూడా ఫిట్నెస్ ని తిరిగి సంపాదించుకోవడానికి తనకు చాలా టైం పడుతుంది. ఇక దర్శకులు రచయితలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఎలాగూ ట్విట్టర్ లో సాయి తేజ్ యాక్టివ్ అయ్యాడు కాబట్టి తన నుంచే డైరెక్ట్ అప్ డేట్స్ ఆశించవచ్చు

Also Read : Movie Collections : జోష్ తగ్గుతున్న టికెట్ కౌంటర్లు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp