వెండితెరపై పిడిగుద్దుల వర్షం

By iDream Post Jul. 14, 2021, 02:30 pm IST
వెండితెరపై పిడిగుద్దుల వర్షం

మన దేశంలో క్రికెట్ కున్న క్రేజ్ ఇంకే క్రీడకు లేదన్న మాట వాస్తవమే కానీ బాక్సింగ్ ని అమితంగా ఇష్టపడే అభిమానులు కోట్లలో ఉన్నారు. కాకపోతే రియల్ స్పోర్ట్ గా కన్నా స్క్రీన్ మీద చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. తెలుగులో పవన్ కళ్యాణ్ తమ్ముడు, రవితేజ అమ్మా నాన్న తమిళ అమ్మాయి లాంటివి ఈ జానర్ లో రూపొంది సూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలు బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుండటం విశేషం. దేనికదే ప్రత్యేకత కలిగినది కావడంతో అన్నిటి మీద అంచనాలు భారీగా ఉన్నాయి. వీటిలో రెండు ఓటిటి రిలీజులు కాగా మరో రెండు థియేటర్లో వచ్చే స్ట్రెయిట్ తెలుగు సినిమాలు.

ముందుగా రాబోతున్నది 'తూఫాన్'. ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో రాకేష్ ఓం ప్రకాష్ మెహరా దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామా ఈ నెల 16న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. భాగ్ మిల్కా భాగ్ కాంబినేషన్ కావడంతో బజ్ ఎక్కువగా ఉంది. కాలా కబాలి ఫేమ్ పా రంజిత్ దర్శకత్వం వహించిన 'సర్పట్ట పరంబరై'లో ఆర్య కండలు తిరిగిన దేహంతో పిడిగుద్దులు కురిపించబోతున్నాడు. ఇది కూడా ప్రైమ్ లోనే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్య దీని కోసమే సిక్స్ ప్యాక్ బాడీ వర్క్ అవుట్ చేసి చాలా కష్టపడ్డాడు. థియేటర్ అనుకున్నారు కానీ సాధ్యం కాకపోవడంతో డిజిటల్ కు ఇచ్చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుంది

ఇక తెలుగు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ కాంబోలో రూపొందుతున్న 'లైగర్' సైతం బాక్సర్ స్టోరీనే. కాకపోతే చాలా వైల్డ్ గా వయొలెంట్ గా డిఫరెంట్ స్టైల్ లో ఉంటుందని సమాచారం. విడుదల ఇంకా ఖరారు కాలేదు కానీ బాలన్స్ షూటింగ్ ని పూర్తి చేయడం మీద టీమ్ దృష్టి పెట్టింది. వరుణ్ తేజ్ నటిస్తున్న 'గని' కూడా బాక్సర్ కథే. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో అల్లు అరవింద్ మొదటి అబ్బాయి అల్లు వెంకటేష్ నిర్మాతగా పరిచయం కాబోతున్న ఈ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తానికి 2021 బాక్సింగ్ సినిమాలతో అభిమానులను అలరించబోతోంది. చూడాలి ఈ యుద్ధంలో ఎవరు ఎక్కువ మార్కులు దక్కించుకుంటారో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp