డిజిటల్ రిలీజులతో వింత ఇబ్బంది

By iDream Post May. 06, 2021, 11:30 am IST
డిజిటల్ రిలీజులతో వింత ఇబ్బంది
రెండేళ్ల ముందేమో కానీ లాక్ డౌన్ వల్ల సామాన్యులకు సైతం ఓటిటి మీద పూర్తి అవగాహన వచ్చేసింది. వాటి చందాలు, వ్యవహారాలు, విడుదల సమయాల గురించి క్రమం తప్పకుండ సోషల్ మీడియా సహాయంతో తెలుసుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం ఈ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇన్ఫర్మేషన్  సులువుగా దొరుకుతోంది. అయితే ఇందులో చాలా లోతైన కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచమంతా ఓటిటిలు ఒకే తరహా ప్రసారాలు ఇస్తాయనుకుంటాం కానీ ఇది తప్పు. ఉదాహరణకు అమెజాన్ ప్రైమ్ అమెరికా కంటెంట్ ఇండియాలో విడుదల చేసే సినిమాలు సిరీస్ లలో వ్యత్యాసాలు ఉంటాయి. అక్కడ స్ట్రీమింగ్ జరిగేవి కొన్ని ఇక్కడ రావు.

అలాగే ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఆహా ఇస్తున్న కొన్ని సినిమాలు ఇక్కడ రావు. ఉదాహరణకు వకీల్ సాబ్ ఇప్పుడు ఆహాలో కూడా ఉంది. కానీ ఇంటర్ నేషనల్ వ్యూయర్స్ కు మాత్రమే. ఇక్కడ చూడాలంటే మాత్రం ప్రైమ్ మీద ఆధారపడాల్సిందే. ఇవి కాకుండా కేవలం విదేశాల్లో మాత్రమే స్టీమింగ్ సర్వీస్ ఇచ్చే ఓటిటిలు కొన్ని ఉన్నాయి. వాటిలో సింప్లీ సౌత్, టెన్ట్కొట్టా, ఎంతుసియన్ లాంటివి ముఖ్యమైనవి. ఎక్కువగా తమిళ సినిమాలు వీటి ద్వారా బయటి దేశాల ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయి. వీటి వల్ల మనకొచ్చిన చిక్కు ఏమిటి అనుకుంటున్నారా. కొంచెం లోతులోకి వెళ్తే మీకే అర్థమవుతుంది.

ఇటీవలే ధనుష్ కర్ణన్ ఇందులో ఒక యాప్ ద్వారా ఫారిన్ లో రిలీజైపోయింది. పైరసీ వీరులు ఊరికే ఉంటారా. వెంటనే సబ్ టైటిల్స్ తో సహా హెచ్డి వెర్షన్ ను తమ సైట్లలో పెట్టేశారు. ఇంకేముంది. నెటిజెన్లు తండోపతండాలుగా ఆ సినిమాను చూసేశారు. దీంతో ప్రైమ్ లో 9న అఫీషియల్ గా రావాల్సిన  కర్ణన్ ని వారం ముందే పబ్లిక్ చూసేశారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు కూడా పంచుకున్నారు. కార్తీ సుల్తాన్ కు కూడా అచ్చం ఇలాగే జరిగింది. టెక్నాలజీ చాలా చీప్ గా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇకపై ఓటిటి సంస్థలు నిర్మాతలు తమ ప్లానింగ్ ని దానికి తగ్గట్టు మార్చుకోవాల్సిందే. లేదంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp