టాలీవుడ్ సందడి మొదలయ్యింది

By iDream Post Jun. 14, 2021, 02:00 pm IST
టాలీవుడ్ సందడి మొదలయ్యింది
నిన్నా మొన్నటి దాకా షూటింగులు లేక సైలెంట్ గా ఉన్న స్టూడియోలు ఇకపై కళకళలాడనున్నాయి. చిన్నా చితకా సినిమాలు,టీవీ సీరియళ్లు గుట్టుచప్పుడు కాకుండా లాక్ డౌన్ లేని టైంలో చిత్రీకరణలు జర్పుకుంటూనే ఉన్నాయి కానీ స్టార్ హీరోలెవరూ ఇప్పటిదాకా ఆ సాహసం చేయలేకపోయారు. నితిన్ ఇప్పుడు ముందడుగు వేశాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న అందాదున్ రీమేక్ మ్యాస్ట్రో ఫైనల్ షెడ్యూల్ ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో మొదలు పెట్టేశారు. ఇంకొద్ది భాగం మాత్రమే బ్యాలన్స్ ఉండటంతో అది కాస్తా కానిచ్చేసి గుమ్మడి కాయ కొట్టేస్తారు. ఎన్ని రోజులు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

అంతా సవ్యంగా ఉంటే మ్యాస్ట్రో ఈ నెల 11న విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ వేసుకోక తప్పలేదు. ఆ మధ్య దీన్ని డైరెక్ట్ ఓటిటికి ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ దాన్ని ఖండిస్తూ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు థియేటర్లు మెల్లగా తెరుచుకుంటున్నాయి కాబట్టి నిర్ణయం మారినా ఆశ్చర్యం లేదు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో తమన్నా నెగటివ్ క్యారెక్టర్ చేయడం ఆసక్తి కలిగించే విషయం. ఒరిజినల్ వెర్షన్ టబు చేసిన ఈ పాత్ర కథలో చాలా కీలకం. మహతి స్వర సాగర్ అందించిన పాటలను త్వరలో ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నారు.

సో రానున్న రోజుల్లో మెల్లగా అందరూ సెట్లలోకి అడుగు పెట్టబోతున్నారు. వెంటనే రంగంలోకి దిగాల్సిన ఆచార్య, అఖండ, ఖిలాడీ లాంటి వాటి మీద ఒత్తిడి అధికంగా ఉంది. మహా అయితే ఓ రెండు వారాలు కంటిన్యూ గా వర్క్ చేస్తే ఇవి ఫైనల్ కాపీ పనులకు  వెళ్లిపోతాయి. రిలీజ్ ఎప్పుడు ఉన్నా ముందైతే షూటింగ్ పూర్తి చేసుకుంటే మంచిదనే అభిప్రాయంలో అందరూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఏ వైరస్ ముంచుకొచ్చి పరిస్థితులను తారుమారు చేస్తుందో అర్థం కాని అయోమయంలో అంతా బాగున్నప్పుడే వేగం పెంచితే మంచిది. లాక్ డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తున్న సినీ కార్మికులకు ఇకపై ఉపాధి దొరకనుంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp