కెజిఎఫ్ 2 కోసం కొన్ని రిపేర్లు

By iDream Post Oct. 27, 2020, 07:21 pm IST
కెజిఎఫ్ 2 కోసం కొన్ని రిపేర్లు

సౌత్ లోనే కాక యావత్ దేశం మొత్తం మూవీ లవర్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కెజిఎఫ్ చాఫ్టర్ 2 షూటింగ్ ఇంకొంత భాగం మాత్రమే పెండింగ్ ఉంది. క్యాన్సర్ బారిన పడి ఇటీవలే కోలుకున్న సంజయ్ దత్ వల్ల ఆలస్యమయింది కానీ లేకపోతే ఈపాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా వేగంగా జరిగేవి. అతి త్వరలో సంజు సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు. కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ముందు దీని పని పూర్తి చేశాకే సంజయ్ దత్ ఇతర బాలీవుడ్ సినిమాల షూట్లో పాల్గొనబోతున్నారు. అయితే తన కోసమే కెజిఎఫ్ టీమ్ కొన్ని కీలక మార్పులు చేస్తోందట.

ముందు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కాకుండా సంజయ్ దత్ కి ఎక్కువ రిస్క్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్లలో కొన్ని రిపేర్లు చేస్తున్నట్టు బెంగుళూరు టాక్. స్వయంగా హీరో యష్ వీటిని పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. సంజయ్ దత్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిస్క్ అనిపించే షాట్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారట. ఒకవేళ తప్పదు అనుకున్న చోట డూప్ ని వాడి విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో మేనేజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంపాక్ట్ తగ్గకుండా వీలైనంత త్వరగానే ఈ పార్ట్ ని ఫినిష్ చేసి సంజయ్ దత్ ని పంపించేలా ప్లాన్ చేసుకున్నారు.

కెజిఎఫ్ 2 వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అదే టార్గెట్ పెట్టుకున్నారు కానీ జనవరికంతా థియేటర్లకు పూర్తి కెపాసిటీకు అనుమతులు వస్తే రిలీజ్ చేయొచ్చు. అలా జరగని పక్షంలో మళ్ళీ వాయిదా తప్పదు. పాన్ ఇండియా లెవల్ లో కోట్లాది రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న కెజిఎఫ్ 2 మీద ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రవీనాటాండన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కోలార్ బంగారు గనులను తన అధీనంలోకి తీసుకున్నాకా రాఖీ భాయ్ ఏం చేసాడు, తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకున్నాడు, చివరికి అతని కథ ఎలా ముగిసింది అనే పాయింట్ తో ఈ సీక్వెల్ రూపొందింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp