ఫిబ్రవరి 2021 సినిమా పాఠాలు

By iDream Post Mar. 02, 2021, 03:21 pm IST
ఫిబ్రవరి 2021 సినిమా పాఠాలు

దేశం మొత్తం లాక్ డౌన్ సంక్షోభం నుంచి బయట పడుతున్న తరుణంలో చాలా తీవ్రంగా ప్రభావితం చెందిన రంగాల్లో సినిమా పరిశ్రమ ముందుంది. ఎక్కడా లేని విధంగా ఒక్క టాలీవుడ్ లోనే జనవరి నుంచే వరసగా విడుదలలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సాధారణంగా డ్రైగా భావించే ఫిబ్రవరి కూడా ఈసారి వర్క్ అవుట్ అయ్యేలా జరగడం విశేషం. అయితే ఈ నెలలో నేర్చుకోవాల్సిన సినిమా పాఠాలేంటో చూద్దాం. ఊహించని విధంగా రికార్డులు బద్దలు కొడుతూ ఏకంగా యాభై కోట్ల షేర్ కు దగ్గరగా ఉన్న ఉప్పెన నేటివిటీ, యవ్వన ప్రేమ, భారీ బడ్జెట్, అద్భుతమైన పాటలు ఇవన్నీ సరిగ్గా కుదిరితే కంటెంట్ కొంచెం అటుఇటుగా ఉన్నా కోట్లు రాబట్టుకోవచ్చని ఋజువు చేసింది.

ఉప్పెన ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్సిన మాట వాస్తవం. మూడో వారం వీకెండ్స్ లోనూ హౌస్ ఫుల్ బోర్డులు పడటమే దానికి నిదర్శనం ఎన్నో అంచనాలతో వచ్చిన నితిన్ చెక్ తీవ్రంగా నిరాశపరిచింది. చెస్ క్రీడను వాడుకుని ఏదో చెప్పాలని ప్రయత్నించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి నేలవిడిచి సాము చేయడం బెడిసి కొట్టింది. థియేట్రికల్ బిజినెస్ లో సగం పైన రావడమే గొప్ప అనేలా వసూళ్లు బాగా పడిపోయాయి. మొదటి వారంలో వచ్చిన జాంబీరెడ్డి తక్కువ బడ్జెట్ లో రూపొంది కొంత వెరైటీ కాన్సెప్ట్, హంగామా ప్రమోషన్ లను కలగలుపుకుని సేఫ్ వెంచర్ అయ్యింది. కలెక్షన్ల లెక్కలో చూసుకుంటే హిట్ గానే పరిగణించేలా చేసుకుంది.

అల్లరి నరేష్ నాంది అతని సెకండ్ ఇన్నింగ్స్ కి పర్ఫెక్ట్ లాంచ్ గా ఉపయోగపడింది. కామెడీ జోలికి వెళ్లకుండా చేసిన సిన్సియర్ ప్రయత్నం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఇక టైటిల్ తో ఏదో చేద్దామని చిత్రవిచిత్రంగా తయారైన ఎఫ్సియుకె మూడు రోజులకే టపా కట్టేయగా కన్నడ రీమేక్ ని గుడ్డిగా నమ్ముకున్న సుమంత్ కు కపటధారి రూపంలో దారుణ పరాభవం తప్పలేదు. విశాల్ చక్ర హడావిడి చేసింది కానీ దక్కింది తక్కువే. కన్నడ డబ్బింగ్ పొగరు సాధించిందేమీ లేదు కానీ ఆ మాత్రం వసూళ్లు రావడం దానిలో చూపించిన మాస్ కంటెంటే కారణం. ఇంకో పదిహేను దాకా చిన్న సినిమాలు కూడా వచ్చాయి కానీ కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు ఏ మాత్రం మొహమాటపడరని వాటికి జరిగిన తిరస్కరణ సాక్ష్యంగా నిలిచింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp