Entry Free ,Exit Ticket

By G.R Maharshi 18-11-2019 02:15 PM
Entry Free ,Exit Ticket

ఒక సినిమాకి Entry Free అని తెలియ‌గానే ర‌క‌ర‌కాల ఉచితాల‌కి అలవాటు ప‌డిన ప్రేక్ష‌కులు పోలోమంటూ ప‌రుగుతీశారు. సిగ‌రెట్లు తాగితే మాడి మసై పోతార‌ని కింది ద‌వ‌డ లేని ఒకావిడ‌తో చెప్పించి హిత‌బోధ చేయించారు. సెన్సార్ స‌ర్టిపికెట్ ప‌డ‌గానే అంద‌రూ స‌ర్దుకుని కూర్చున్నారు. ప‌ది నిమిషాల పాటు వెయ్యిన్నొక్క మందికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకున్నారు నిర్మాత‌లు.

త‌ర్వాత టైటిల్ "వ‌స్తే చ‌స్తావ్" ఇలాంటివి ఎన్నో చూశాం అని ప్రేక్ష‌కులు వాట్స‌ప్ చూడ‌టానికి ప్ర‌య‌త్నించారు. సిగ్న‌ల్ లేదు. హాల్లోకి సిగ్న‌ల్ వ‌స్తే ప్రేక్ష‌కులు ఫోన్‌దారి ప‌డ‌తార‌ని నిర్మాత‌లే ముందు జాగ్ర‌త్తగా సిగ్న‌ల్ బంద్ చేయించార‌ని అర్థ‌మైంది. చేసేదేమీ లేక తెల్ల‌మొహంతో తెర‌ని చూడ‌సాగారు.

పెద్ద క‌ర్ర ప‌ట్టుకుని హీరో Entry ఇచ్చాడు. ప్రేక్ష‌కులు కంగారుగా ఒక‌రినొక‌రు చూసుకున్నారు. హీరో ఒక‌న్ని గాల్లోకి ఎగరేసి తానూ గాల్లోకి ఎగిరాడు. DTS సౌండ్ చెవుల్ని తుపాను గాలిలా సోకింది. రౌడీని హీరో పుట్‌బాల్ ఆడ‌సాగాడు. గాల్లోంచి దిగి ఒక పాట ఎత్తుకున్నాడు. జ‌నాల‌కి అర్థ‌మైంది ఫ్రీగా త‌మ‌ని పెనంమీద కూచో పెట్టార‌ని. ఒక‌రిద్ద‌రు ధైర్యంగా లేచి Exit వైపు చూశారు. అక్క‌డ కొంద‌రు హాకీ స్టిక్స్‌తో క‌నిపించారు. Exit వైపు ఎవ‌రూ రాకుండా క‌ర్ర‌ల్ని గాల్లో తిప్పారు. ప్రేక్ష‌కులు ఏడుపు మొహంతో కూచున్నారు. హీరో ఈ సారి తుపాకితో వ‌చ్చాడు. కొంద‌రు ఎగ్జిట్ వైపు ప‌రిగెత్తితే హాకీ స్టిక్‌తో దెబ్బ‌లు ప‌డ్డాయి. ఇది అన్యాయ‌మ‌ని ప్రేక్ష‌కులు అరిచారు. వెళ్లాల‌ని ఉంటే Exit టిక్కెట్ రూ.200 అని క‌ర్ర ధ‌రించిన వాళ్లు చెప్పారు.జ‌నం ఆద‌రాబాద‌రా జేబులు త‌డుముకుని ఒక‌ర్నొక‌రు తోసుకుంటూ బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేశారు. ఈ తోపులాట‌ని కొంద‌రు వీడియోలు తీసి Upload చేయాల‌ని ప్ర‌య‌త్నించి సిగ్న‌ల్ లేక విఫ‌ల‌మ‌య్యారు.

తెలుగులో ఈ ప్ర‌యోగం స‌క్సెస్ అయ్యింద‌ని నిర్మాత‌ల‌కి Entry కంటే Exit టికెట్టే Safe అని ప‌త్రిక‌లు రివ్యూలు రాశాయి

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News