వెంకీ సినిమాల్లో ఏది ముందు

By iDream Post Apr. 06, 2021, 06:31 pm IST
వెంకీ సినిమాల్లో ఏది ముందు
2019 స్టార్టింగ్ లో ఎఫ్2, ఎండింగ్ లో వెంకీ మామతో పలకరించిన విక్టరీ వెంకటేష్ ఈసారి ఏకంగా మూడు సినిమాలతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఏ సీనియర్ హీరోకు సాధ్యం కాని రీతిలో ఇంత వేగంగా షూటింగ్స్ లో పాల్గొనడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నారప్ప ఇప్పటికే మే 14 విడుదల తేదీ లాక్ చేసుకోగా ఎఫ్3ని ఆగస్ట్ 27న తెస్తామని నిర్మాత దిల్ రాజు అధికారికంగానే అనౌన్స్ చేశారు. అయితే వీటి మధ్యలో అనూహ్యంగా దృశ్యం 2 రావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని  పరిస్థితి నెలకొంది. ఏ వరసలో ఏది ముందు వస్తుందో అంతు చిక్కడం లేదు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.

దృశ్యం 2 ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రాధమికంగా జూన్ 20 రిలీజ్ చేయాలనీ డిసైడ్ కూడా అయ్యారని చెబుతున్నారు. ఫాదర్స్ డే కాబట్టి సందర్భం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. మరి మే 14 రావాల్సిన నారప్పను ఆ డేట్ కే కట్టుబడి విడుదల చేస్తారా లేదా అనేది అంతు చిక్కడం లేదు. ఎందుకంటే నారప్ప టీమ్ ఉన్నట్టుండి సైలెంట్ అయ్యింది. ఇప్పటిదాకా ఒక టీజర్ రాలేదు. లిరికల్ వీడియో వదల్లేదు. అడపాదడపా పోస్టర్లు తప్ప అంతకు మించిన ప్రమోషన్ లేదు. ఆ మధ్య వెంకీ బర్త్ డేకు చిన్న వీడియో బిట్ ని రిలీజ్ చేసి అందులో అసురన్ బ్యాక్ గ్రౌడ్ స్కోర్ ని వాడటం పట్ల మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో నిరసన వ్యక్తం చేశాడు కూడా.

ఈ లెక్కన చూస్తే చాలా ఆలస్యంగా మొదలైన దృశ్యం 2 ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వెళ్లిపోగా ఈపాటికి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉండాల్సిన నారప్ప మాత్రం తన ప్రోగ్రెస్ ని దాచి పెడుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఇంకొద్ది రోజులు ఆగుదామని చూస్తున్నారట. అసలే ఆచార్య వాయిదా పడే ఛాన్స్ ఉండగా నారప్ప వస్తే మంచి స్కోప్ దొరుకుతుందని వెంకీ ఫ్యాన్స్ అభిప్రాయం. తీరా పరిస్థితి చూస్తేనేమో ఇలా ఉంది. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా దృశ్యం 2 బాధ్యతలు ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తీసుకున్నారు. ఇంకొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp