ప్రభాస్ జోడిగా భాగీ బ్యూటీ

By iDream Post Dec. 09, 2020, 01:08 pm IST
ప్రభాస్ జోడిగా భాగీ బ్యూటీ

వరస సినిమా ప్రకటనలతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రభాస్ ఇటీవలే కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న సలార్ ఫస్ట్ లుక్ రూపంలో స్వీట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆది పురుష్ కంటే వేగంగా దీని పనులు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. హీరోయిన్ గా దిశా పటానిని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముంబై రిపోర్ట్. ఆల్రెడీ నిర్మాతలు తనతో సంప్రదింపులు కూడా చేశారట. డేట్స్ ఎప్పుడు అవసరం పడతాయో చూసుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దిశాతో పాటు మరో ఇద్దరు కథానాయికలు ఉండొచ్చని కూడా అంటున్నారు. ఎక్కువ డీటెయిల్స్ బయటికి రావడం లేదు.

టైగర్ ష్రాఫ్ తో చేసిన భాగీ ద్వారా పేరు తెచ్చుకున్న దిశా పటాని గ్లామర్ షోకు ఏ మాత్రం మొహమాటపడదు. సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో స్టిల్స్ వదులుతూ ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేస్తుంటుంది. అలాంటిది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో మూవీ అంటే ఇక చెప్పేదేముంది. ప్రభాస్ తో ఎవరు సినిమా తీసినా ఖచ్చితంగా నార్త్ భామలనే తీసుకోవాల్సి వస్తోంది. నార్త్ ఆడియన్స్ టేస్ట్ ని బట్టి నడుచుకోక తప్పడం లేదు. రాధే శ్యామ్ లో చేస్తున్న పూజా హెగ్డే కూడా అక్కడివారికి పరిచయమున్న బ్యూటీ కావడం ఇబ్బంది లేదు కానీ ఆది పురుష్ కు సైతం ఇదే ఫార్ములా పాటించక తప్పేలా లేదు.

సలార్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి కన్నడ మూవీ లవర్స్ ప్రశాంత్ నీల్ మీద గుర్రుగా ఉన్నారు. శాండల్ వుడ్ హీరోలను వదిలేసి తెలుగు స్టార్ల తోనే వరసగా సినిమాలు కమిట్ కావడం దానికి కారణం. సలార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ఉండొచ్చన్న టాక్ వాళ్లకు ఇంకాస్త ఆగ్రహం కలిగించింది. అయినా ప్రశాంత్ నీల్ అవేవి పట్టించుకునే స్థితిలో లేడు. కెజిఎఫ్ 2 వేసవి విడుదలకు రెడీ అవుతోంది. అది అయ్యేలోపే సలార్ ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. అంతా కలిసి వస్తే రాధే శ్యామ్, సలార్ రెండూ 2021లోనే విడుదలైనా ఆశ్చర్యం లేదు. కానీ పరిస్థితులు అనుకూలించాలి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp