ఉదయ కిరణ్ సినిమా అందుకే దెబ్బతింది

By iDream Post Aug. 02, 2020, 07:00 pm IST
ఉదయ కిరణ్ సినిమా అందుకే దెబ్బతింది

19 ఏళ్ళ క్రితం వచ్చిన మనసంతా నువ్వే అప్పట్లో ఒక సంచలనం . నువ్వు నేను తర్వాత అంత స్థాయి బ్రేక్ తెచ్చిన మూవీగా ఉదయ్ కిరణ్ అభిమానులు ఇప్పటికీ దాని గురించి గర్వంగా చెప్పుకుంటారు. కమర్షియల్ గా వెళ్ళకుండా ఫీల్ గుడ్ మూవీస్ తో ఆకట్టుకునే దర్శకుడు విఎన్ ఆదిత్య డెబ్యుతోనే అంత ఘన విజయం అందుకోవడం చూసి షాక్ అవుతూ చూసిన వాళ్లే ఎక్కువ. అయితే ఈయనకూ ద్వితీయ విఘ్నం తప్పలేదు. తన మొదటి సినిమా హీరోతోనే విఎన్ ఆదిత్య తమిళ హిట్ మూవీ 'దిల్'ని శ్రీరామ్ గా రీమేక్ చేశారు. నిజానికి గట్టిగా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఒక రీమేక్ చేయడం అంటే ఏ దర్శకుడికైనా అంతగా ఇష్టం ఉండదు. కాని అప్పుడు జరిగిన సంఘటన వేరే.

మనసంతా నువ్వే రీ రికార్డింగ్ జరుగుతుండగానే నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ ఆదిత్యకు 50 వేలు అడ్వాన్సు పంపించి లాక్ చేసుకున్నారు. అప్పటికే అదే సంస్థలో అసోసియేట్ గా పని చేసిన అనుభవం వల్ల నో చెప్పలేకపోయారు. కాని ఒరిజినల్ వెర్షన్ లో విక్రం చేసిన పాత్రకు ప్రభాస్ లాంటి స్టేచర్ ఉన్న హీరో అయితే సెట్ అవుతాడు కానీ సాఫ్ట్ ఇమేజ్ ఉన్న ఉదయ్ కిరణ్ కాదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆదిత్య. అప్పటికే ఉదయ్ కిరణ్ డేట్స్ శివరామకృష్ణ గారి దగ్గర ఉన్నాయి. ఇక వేరే ఆప్షన్ లేకపోయింది. విఎన్ ఆదిత్య ముందే కమిట్ అయ్యారు కాబట్టి నో అనలేని పరిస్థితి. ఇలా అనుకుంటూనే సినిమా చేశారు. తీరా విడుదలయ్యాక ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఆదిత్య-ఉదయ్ కాంబోలో ప్రేక్షకులు ఆశించింది అది కాదు. మనసంతా నువ్వే లాంటి మ్యాజిక్ ని కోరుకున్నారు.

తీరా ఇది చూస్తేనేమో మంచి యాక్షన్ కం యూత్ రివెంజ్ డ్రామా. దాంతో తేడా కొట్టేసింది. మంచి పాటలు. పవర్ ఫుల్ స్టొరీ ఇవేవి కాపాడలేకపోయాయి. బిజినెస్ పరంగా నష్టాలు రాలేదు కానీ ఫైనల్ గా రిజల్ట్ మాత్రం ఫ్లాప్ అనే చెప్పుకోవాల్సి వచ్చింది. ఒకవేళ విఎన్ ఆదిత్య రాజీ పడకుండా వేరే కథతో చేసుకుంటే ఖచ్చితంగా ఇంకో హిట్టు దక్కేది. అందుకే దాన్ని వెంటనే సరిదిద్దుకుని నాగార్జున ఆఫర్ ని జాగ్రత్తగా వాడుకుని నేనున్నాను లాంటి సూపర్ హిట్ ను అందుకున్నారు. అందుకే మనస్పూర్తిగా చేసే పని ఏదైనా సరే పాజిటివ్ రిజల్ట్ ని ఇస్తుందే తప్ప చేయగలమా లేదా అనే సందేహాలతో తీస్తే మాత్రం శ్రీరామ్ లాంటి అనుభవాలే ఎదురవుతాయి. సో శ్రీరామ్ వెనుక ఇంత జరిగింది. ఒక ప్రేక్షకుడిగా నేనే మనసంతా నువ్వే తర్వాత శ్రీరామ్ లాంటి సినిమాను యాక్సెప్ట్ చేయలేనని ఆదిత్య గారే చెప్పడం ఫైనల్ ట్విస్ట్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp