Akhanda : బ్లాక్ బస్టర్ సీక్వెల్ గురించి బోయపాటి క్లారిటీ

By iDream Post Jan. 12, 2022, 06:30 pm IST
Akhanda : బ్లాక్ బస్టర్ సీక్వెల్ గురించి బోయపాటి క్లారిటీ

గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనిది ఒక సినిమా విడుదలైన నలభై రోజుల తర్వాత మరోసారి సక్సెస్ మీట్ చేయడం ఒక్క అఖండకు మాత్రమే జరిగింది. సంక్రాంతికి బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ మూవీ ఏదీ లేకపోవడంతో బిసి సెంటర్స్ లో ఇంకొన్ని రోజులు బలమైన రన్ దక్కుతుందన్న డిస్ట్రిబ్యూటర్ల సమాచారంతో నిర్మాత మళ్ళీ పబ్లిసిటీ మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇవాళ యూనిట్ మొత్తం హాజరు కాగా విజయోత్సవ వేడుక చేశారు. అర్ధ శతదినోత్సవం కాకుండా ఇదెందుకనే అనుమానాలు వచ్చినా కూడా పుష్ప ఓటిటిలో వచ్చాక దాని కలెక్షన్లు డ్రాప్ అవ్వడంతో ఆ అవకాశాన్ని అఖండ వాడుకునేందుకు డిసైడ్ అయ్యింది. అందుకే ఈ వేడుక.

ఇందులోనే దర్శకుడు బోయపాటి శీను అఖండ 2 ఉంటుందని స్పష్టంగా చెప్పేశారు. దానికి సంబంధించిన లీడ్ కూడా సినిమాలో ఇచ్చానని చెప్పుకొచ్చారు. అదేంటనేది కొందరికి డౌట్ రావొచ్చు. దానికి క్లారిటీ చూద్దాం. అఖండలో తన కవల సోదరుడి కూతురికి మాట ఇచ్చిన బాలయ్య ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు తలుచుకుంటే వస్తానని మాట ఇస్తాడు. సో ఇదే సీక్వెల్ కి కీలక పాయింట్ గా మారనుంది. సెకండ్ హాఫ్ లో పూర్తి డమ్మీగా మారిపోయిన ఫస్ట్ బాలయ్యని రెండో భాగంలో ఎక్కువ వాడుకోవచ్చు. పాప పెద్దయ్యాక వచ్చే ప్రమాదం చుట్టూ, చనిపోయిన విలన్ బాబా స్థానంలో ఇంకొక ప్రతినాయకుడిని తీసుకురావడం ద్వారా మంచి ప్లాట్ సెట్ చేయొచ్చు

మొత్తానికి బోయపాటి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఇదే సందర్భంలో అల్లు అర్జున్ బాలయ్య కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారన్న వార్తకు కూడా ఆయన పాజిటివ్ గా స్పందించడం ఆసక్తి రేపింది. పూర్తిగా ఆ ప్రశ్నను కొట్టిపారేయకుండా ఛాన్స్ ఉందనేలా హింట్ ఇవ్వడం గమనించాల్సిన అంశం. ఇక అఖండ 50 డేస్ సెంటర్స్ ఎన్ని వస్తాయనేది వేచి చూడాలి. సంక్రాంతి సినిమాల వల్ల కొన్ని చోట్ల తీసేసినప్పటికీ ప్రధాన కేంద్రాల్లో మాత్రం కొనసాగుతోంది. చాలా ఏళ్ళ తర్వాత డబుల్ డిజిట్ లో అఖండ అర్ధశతదినోత్సవం పోస్టర్ పడుతుందేమో చూడాలి. 21న హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ జరగనుంది

Also Read : 2022 Sankranthi Releases : 100 కోట్ల సినిమా ఒక్కటీ లేని సంక్రాంతి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp