బ్రేకులు తప్పని టక్ జగదీశ్

By iDream Post Oct. 18, 2020, 06:33 pm IST
బ్రేకులు తప్పని టక్ జగదీశ్

నిన్న యూనిట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడం వల్ల టక్ జగదీశ్ షూటింగ్ ఆపేశారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యక్తి సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ అనే టాక్ వచ్చింది కానీ యూనిట్ నుంచి ఎలాంటి ధృవీకరణ లేదు. అయితే నానితో సహా సభ్యులందరూ హోమ్ క్వారెంటైన్ కు వెళ్లినట్టు తాజా సమాచారం. కనీసం రెండు మూడు వారాల పాటు ఈ బ్రేక్ కొనసాగేలా ఉంది. నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పెళ్లి చూపులు రీతూ వర్మతో పాటు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ నెల 7 నుంచే వికారాబాద్ లో షూట్ ని రీ స్టార్ట్ చేశారు.

ఈలోగా ఇలా జరగడం అందరికీ షాక్ కలిగించేదే. లాక్ డౌన్ నిబంధనలు సడలించాక కూడా పూర్తి యాక్టివ్ గా షూటింగులు జరుపుకుంటున్నవి టీవీ సీరియల్స్ మాత్రమే. అడపాదడపా కోవిడ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ తీవ్రమైన ప్రమాదం ఎవరికీ రాని కారణంగా అవన్నీ యథావిధిగా సాగిపోతున్నాయి. కానీ స్టార్ హీరోలు మాత్రం ఇంకా సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు ముందు వెనుకా చేస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ ట్రయిల్ షూట్ విజయవంతం కాగా అసలైన షెడ్యూల్ ని ఇంకా మొదలుపెట్టాల్సి ఉంది. ప్రస్తుతం యూనిట్ జూనియర్ ఎన్టీఆర్ ని పరిచయం చేసే టీజర్ పనుల మీద ఫుల్ బిజీగా ఉంది.

ఇప్పుడీ పరిణామం మళ్ళీ అందరిని ఆలోచనలో పడేయక మానదు. అందులోనూ నగరం వర్షం వరదలతో తడిసి ముద్దవుతోంది. ఒక చోటి నుంచి మరొక చోటికి వెళ్లాలన్నా అదో పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఈ వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపించడంతో ఇన్ డోర్ లో జరుగుతున్నవి మినహాయించి దాదాపు అందరూ పోస్ట్ పోన్ చేసుకున్నారు. పెద్ద హీరో షూటింగ్ జరుగుతున్న సినిమా యూనిట్ లో ఇలా కరోనా పాజిటివ్ రావడం ఈ మధ్యకాలంలో టక్ జగదీశ్ కే జరిగింది.వి డిజాస్టర్ తర్వాత నానికి దీని మీద గట్టి గురి ఉంది. అందులోనూ శివ టేకింగ్ గురించి ప్రేక్షకులకూ తెలిసిందే కనక అంచనాలు కూడా బాగానే ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp