ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరో ?

By iDream Post May. 24, 2021, 05:30 pm IST
ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరో ?
అన్ని సినిమాలకు జరిగినట్టే ప్రభాస్ ఒకే టైంలో చేస్తున్న మూడు షూటింగులకు బ్రేకులు పడ్డాయి. రాధే శ్యామ్ చివరి అడుగులో ఉండగా సలార్ ఇప్పటికే పాతిక శాతం దాకా పూర్తి చేశారని టాక్. ఇక ఆది పురుష్ కూడా ఇంచుమిందు ఇదే ప్రోగ్రెస్ లో ఉంది. అందరి కళ్ళు ఎక్కువగా సలార్ మీదే ఉన్నాయి. కెజిఎఫ్ తో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తమ హీరోని ఏ రేంజ్ లో ఎలివేట్ చేసి చూపిస్తాడా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదల వచ్చే ఏడాది ఏప్రిల్ అయినప్పటికీ రాధే శ్యామ్ తో సమానంగా సలార్ ఇంకా ప్రొడక్షన్ లోనే విపరీతమైన క్రేజ్ తెచ్చేసుకుంటోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలకమైన పాత్రకు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాన్ అబ్రహంను తీసుకునే ఛాన్స్ ఉందని బెంగళూరు టాక్. కెజిఎఫ్ చూశాక తమ క్యారెక్టర్ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోకుండానే తమ డేట్లు ఇచ్చేందుకు హీరోలు రెడీగా ఉన్నారు. అందుకే కెజిఎఫ్ 2 కోసం సంజయ్ దత్ ని అడగ్గానే మరో ఆలోచన చేయకుండా ఒప్పేసుకున్నారు. ఇప్పుడు నిజంగానే జాన్ అబ్రహంకి ప్రపోజ్ చేస్తే అతను నో చెప్పే అవకాశాలు తక్కువే అనుకోవాలి. కానీ అఫీషియల్ గా బయట పడేందుకు కొంత టైం అయితే పడుతుంది. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా బాలీవుడ్ బ్యాచ్ ని ప్రభాస్ సినిమాలో తీసుకోవడం బాహుబలి తర్వాత సాహు నుంచి దర్శకులు క్రమం తప్పకుండ ఫాలో అవుతూనే ఉన్నారు. పాన్ ఇండియా ఫ్లేవర్ రావాలంటే అన్ని బాషలకు చెందిన నటీనటులు ఉండటం చాలా అవసరం. అందుకే ప్రతి చిత్రం విషయంలోనూ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సలార్ కు జాన్ అబ్రహం తోడైతే హైప్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. కరోనా వల్ల రాధే శ్యామ్ తో సహా అన్నీ బ్రేక్ పడటంతో ముందు అనుకున్న రిలీజ్ ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అయ్యేలా ఉంది. అసలు రాధే శ్యామ్ అయినా ఆగస్ట్ లోపు వస్తుందా అంటే ఏదీ చెప్పలేని పరిస్థితి. చూద్దాం.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp