సంచలనాలు రేపిన వెబ్ సిరీస్ లు

By iDream Post Jun. 09, 2021, 12:00 pm IST
సంచలనాలు రేపిన వెబ్ సిరీస్ లు
రెండు మూడేళ్ళ క్రితం వరకు భారతీయ ప్రేక్షకులకు బాగా అలవాటైన వినోద సాధనాలు రెండే. ఒకటి టీవీ రెండు సినిమా. 4జిలు వచ్చినా 5జిలు వచ్చినా ఇవి కూడా అధిక శాతం వీటి కంటెంట్ మీద ఆధారపడి నడుస్తున్నవే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓటిటిల రంగప్రవేశంతో జనానికి కొత్త అనుభూతి మొదలయ్యింది. అదే వెబ్ సిరీస్. సీరియల్స్ తరహాలో ఎపిసోడ్ల వారిగా ఉండే వీటికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఒకేసారి లేదా వీలు కుదిరినప్పుడు భాగాలుగా చూసే సౌలభ్యం ఉండటంతో పాపులారిటీ కూడా బాగా తెచ్చుకుంటున్నాయి. ఏ స్థాయిలో ఉంటే పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్లు సైతం వీటిలో నటించేంత.

ఇప్పటిదాకా వచ్చిన వాటిలో ట్రెండ్ సృష్టించిన వెబ్ సిరీస్ ల మీద లుక్ వేద్దాం. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం స్టాక్ మార్కెట్ ని వేదికగా చేసుకుని హర్షద్ మెహతా చేసిన కుంభకోణం మీద వచ్చిన 'స్కామ్ 1992' అతి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సామాన్యులకు అంత సులభంగా అర్థం కాని కాన్సెప్ట్ ని విసిగించకుండా సుదీర్ఘంగా చూపించిన తీరు దానికి పనిచేసిన ప్రతిఒక్కరికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఇక రెండో స్థానంలో 'ది ఫ్యామిలీ మ్యాన్' తాలూకు సంచలనాలు చూస్తూనే ఉన్నాం. మనోజ్ బాజ్ పాయ్, సమంతాల మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు మూడో భాగం కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

బోలెడంత బూతు ఉన్నా కూడా సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచిన 'మిర్జాపూర్' రెండు సీజన్లు భారీ హిట్ అయ్యాయి. హింస శృతి మించడంతో కుటుంబ ప్రేక్షకులు దీనికి దూరమైనా యూత్ మాత్రం విపరీతంగా ఆదరించింది. తర్వాత చెప్పుకోవాల్సింది 'ఢిల్లీ క్రైమ్'. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని తీసుకుని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. టెర్రరిజం నేపథ్యంలో వచ్చిన 'స్పెషల్ ఓపిఎస్' కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇవి కాకుండా బ్రీత్, ఆర్య, అన్ దేఖీ, పంచాయత్ లాంటివి మంచి పేరు తెచ్చుకున్నాయి కానీ టాప్ 5కి మాత్రం రిపీట్ ఆడియన్స్ ఉన్నారు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp