వెంకటేష్ 75కి క్రేజీ కాంబినేషన్ ?

By iDream Post Sep. 15, 2020, 04:16 pm IST
వెంకటేష్ 75కి  క్రేజీ  కాంబినేషన్ ?

విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమా మైల్ స్టోన్ కి దగ్గరలో ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న నారప్ప 74వది. ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి క్రేజీ కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. రెండు రోజుల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ డీల్ చేయబోతున్నారని గాసిప్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే దానికి చెక్ పడింది. అందులో నిజం లేదని అర్థమయ్యింది. ఇప్పుడీ స్పెషల్ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించబోతోందని ఫిలిం నగర్ టాక్. దీనికి సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడిగా తరుణ్ భాస్కర్ ఫిక్సయ్యాడట.

గతంలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథా చర్చలు జరిగినప్పటికీ, లీకులు బయటికి వచ్చినప్పటికీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అయితే లక్కీగా తరుణ్ భాస్కర్ కి ఈ మూవీ ఫిక్స్ అయితే మాత్రం విశేషమే. పెళ్లి చూపులు లాంటి చిన్న బడ్జెట్ సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైందితో యూత్ ని బాగానే ఆకట్టుకున్నారు. మీకు మాత్రమే చెప్తాతో హీరోగా మారినా అంతగా ఫలితం దక్కలేదు. మధ్యలో టీవీ యాంకర్ అవతారం కూడా ఎత్తారు. ఇవెన్ని చేసినా ఎప్పటికప్పుడు వెంకటేష్ తో మాత్రం రెగ్యులర్ డిస్కషన్స్ ఉండేవట. సంగీత దర్శకుడిగా మణిశర్మను లాక్ చేసుకున్నారని టాక్. నారప్పకు సంగీతం అందిస్తున్నది కూడా ఆయనే. ఒకప్పుడు వెంకీ-మణిశర్మ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్లు వచ్చాయి.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మ్యూజికల్ గా మంచి ఆల్బమ్స్ పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ గా రిపీట్ కావడం ఫ్యాన్స్ ఆనందపరుస్తోంది. లోగోలో గుర్రం, వెంకటేష్ తల మీద టోపీ, నక్షత్రం మార్కు చూస్తుంటే ఏదో డిఫరెంట్ కంటెంట్ గానే అనిపిస్తోంది. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. నారప్ప షూటింగ్ ఇంకొంత మాత్రమే బ్యాలన్స్ ఉంది. మహా అయితే ఇంకొక్క నెల రోజు షూట్ చేస్తే పూర్తవుతుంది.అది కాగానే దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లవచ్చు. 75వ సినిమా కాబట్టి అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అందులోనూ తరుణ్ భాస్కర్ కి తన స్టామినా మరొక్కసారి ఋజువు చేయాల్సిన అవసరం పడింది. వెంకీ లాంటి స్టార్ దొరికితే అంతకన్నా ఛాన్స్ ఇంకేముంటుంది. సో ఇప్పుడీ న్యూస్ నిజమైతే ఎఫ్3 ఇంకొంత ఆలస్యమవ్వడం ఖాయం.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp