వెంకటేష్ స్టైల్లో బాలీవుడ్ కూలీ

By iDream Post Nov. 28, 2020, 03:06 pm IST
వెంకటేష్ స్టైల్లో బాలీవుడ్ కూలీ

ఇప్పుడంటే రైల్వే కూలీల మీద ఎవరు సినిమాలు తీయడం లేదు ఓ కానీ మూడు దశాబ్దాల క్రితం చెప్పుకోదగ్గ సంఖ్యలో బాగానే వచ్చాయి. అందులో అమితాబ్ బచ్చన్ 'కూలీ' ప్రధానమైనది. తెలుగులో చూస్తే 1991లో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన 'కూలీ నెంబర్ వన్' కమర్షియల్ గా మంచి హిట్టు. ఆ తర్వాత 1995లో బాలీవుడ్ లో గోవిందా హీరోగా ఇంకో కూలీ నెంబర్ వన్ వచ్చింది కానీ అది మన దగ్గరనుంచి తీసుకున్న రీమేక్ కాదు. తమిళ్ 'చిన్న మాపిళ్ళై'కు హిందీ రూపం. దాన్నే తెలుగులో తర్వాత సుమన్ తో 'చిన్నల్లుడు'గా తీశారు. కానీ అన్నిటిలోకి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది మాత్రం హిందీ వెర్షనే.

మళ్ళీ పాతికేళ్ల తర్వాత అదే టైటిల్ తో వరుణ్ ధావన్ హీరోగా ఆయన తండ్రి, నిన్నటి తరం సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందింది. ఇందాకా ట్రైలర్ విడుదల చేశారు. ఆశ్చర్యకరంగా ఇది గోవిందా వెర్షన్ లో కాక మన వెంకటేష్ స్టైల్ లో ఉండటం గమనార్హం. రైల్వే స్టేషన్ లో కూలీగా ఉండే హీరో కొన్ని కారణాల వల్ల హీరోయిన్ కు ఆమె తండ్రికి ధనవంతుడిగా బిల్డప్ ఇచ్చి వాళ్ళను బుట్టలో వేసుకుంటాడు. నిజం తెలిసే టైంలో తాను ఒకడే కాదని ఇద్దరు కవలలమని నమ్మిస్తాడు. మరి అతని లక్ష్యం ఏమిటి, ఎందుకిలా నటించాల్సి వచ్చిందనే పాయింట్ మీద 2020 కూలీ నెంబర్ వన్ రూపొందింది.

వెంకీ కూలీ నెంబర్ వన్ లైన్ కూడా ఇంచుమించు ఇదే తరహాలో ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఎమోషన్ తో కూడిన సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించగా చాలా కాలం తర్వాత పరేష్ రావల్ ఫుల్ లెన్త్ ఎంటర్ టైనింగ్ రోల్ చేసినట్టు కనిపిస్తోంది. అంతా తెలిసిన కామెడీనే చూస్తున్నట్టు అనిపిస్తున్నా అసలు సినిమాలో ఏమైనా ట్విస్టులు ఉన్నాయేమో చూడాలి. ఇది డేవిడ్ ధావన్ కు 45వ సినిమా. వచ్చే నెల క్రిస్మస్ కానుకగా అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ఓటిటి రిలీజ్ చేయబోతున్నారు. అంచనాలు బాగానే ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp