నాగ్ చెప్పిన ఇంట్రెస్టింగ్ సంగతులు

By iDream Post Apr. 01, 2021, 06:30 pm IST
నాగ్ చెప్పిన ఇంట్రెస్టింగ్ సంగతులు

రేపు విడుదల కాబోతున్న వైల్డ్ డాగ్ మీద నాగార్జునకే కాదు అభిమానులకు కూడా కొండంత నమ్మకం ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఇంతటి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో తమ హీరోని చూడబోతున్నామన్న ఆనందం వాళ్ళ కళ్ళల్లో సోషల్ మీడియా పోస్టుల్లో కనిపిస్తూనే ఉంది. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి కొత్త దర్శకులకు చేయూత ఇవ్వడంలో ముందుండే అక్కినేని హీరో శివతో మొదలుపెట్టి ఇప్పటి వైల్డ్ డాగ్ దాకా ఎందరికి అవకాశాలు ఇచ్చారో లెక్కబెట్టడం కష్టం. కొత్తవాళ్ల ఎనర్జీని వాడుకుని తనను తాను కొత్తగా ఆవిష్కరించాలనుకునే నాగ్ ప్రయత్నాలు ప్రతిసారి విజయాలు ఇవ్వలేకపోయినా ఇతర స్టార్లకు లేని ఒక ప్రయోగాత్మక మనస్తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి.

యాక్షన్ నుంచి డివోషనల్ దాకా అన్ని తరహా సబ్జెక్టులు ట్రై చేసిన నాగార్జున ఇప్పటికీ చేయాలనుకున్న జానర్లు ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా స్పేస్ షిప్ లాంటి బ్యాక్ డ్రాప్ తో అంతరిక్షంలో నడిచే కథలో నటించాలని ఉంటడం ఆసక్తి కలిగించే విషయం. ఆరు పదుల వయసులోనూ నాగ్ మైంటైన్ చేస్తున్న ఫిజిక్ వెనుక మంచి డైట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. తండ్రితో కలిసి నటించే ఎన్నో గొప్ప అనుభవాలు కూడా నాగార్జునకు ఉండటం అరుదైన ఘనత. కలెక్టర్ గారి అబ్బాయి, ఇద్దరు ఇద్దరే, అగ్నిపుత్రుడు, శ్రీరామదాసు లాంటి సినిమాల్లో వీళ్ళు చేసిన మేజిక్ ఎంతో గొప్పది. మనం సెట్స్ లో ఇచ్చిన ఏఎన్ఆర్ స్ఫూర్తిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు యువసామ్రాట్

ఇక వైల్డ్ డాగ్ విషయానికి వస్తే దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు తీవ్రవాదులు పెట్టిన బాంబుల వల్ల ఎన్నో అమాయక ప్రాణాలు బలయ్యాయి. దాని వెనుక ఉన్న శక్తులను పట్టుకునేందుకు ఆరుగురు బృందాన్ని నడిపించే ఓ ఎన్ఐఎ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఈ కథ. దర్శకుడు అహిషోర్ సాల్మన్ చెప్పిన విధానం నచ్చడంతో రిస్క్ అయినప్పటికీ డిమాండ్ మేరకు రియల్ లొకేషన్లలో షూట్ చేసి మరీ ఆ అనుభవాన్ని థియేటర్లలో ఇవ్వబోతున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిచే వైల్డ్ డాగ్ లో పాటలు లేకపోయినా అరెస్ట్ చేసే స్క్రీన్ ప్లేతో చివరి దాకా కట్టిపడేసేలా సాగుతుందని నాగ్ గ్యారెంటీ ఇస్తున్నారు. సో వైల్డ్ డాగ్ సృష్టించబోయే ఫైర్ రేపు ఎన్ని సంచలనాలు రేపబోతోందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp