సుమన్ విషయంలో వార్నింగ్ ఇచ్చారు

By iDream Post Jun. 12, 2020, 05:35 pm IST
సుమన్ విషయంలో వార్నింగ్ ఇచ్చారు

అనుకుంటాం కానీ ప్రతిఒక్కటి మన చేతుల్లో ఉండవు అని చెప్పడానికి నిత్యం మనం ఎన్నో అనుభవాలు చవి చూస్తూ ఉంటాం. కొన్ని అనుకూలంగా ఉంటే కొన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివిగా జరుగుతుంటాయి. అనూహ్య పరిణామాలకు దారి తీస్తాయి. ఇప్పుడిది అలాంటిదే. టీవీ యాంకర్, ఆర్టిస్ట్ గా, నటుడిగా, సినిమా దర్శకుడిగా ప్రభాకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇప్పటికీ రెగ్యులర్ గా బుల్లితెరపై కనిపించి మెప్పిస్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ సైతం ఊహించని ఒడిదుడుకులు, సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఈటీవీలో సీరియల్స్, షోలు చేస్తున్నప్పుడు ఆ ఛానల్ ఎండి సుమన్ ఉరఫ్ రామోజీరావు గారి అబ్బాయికి ప్రభాకర్ కి మంచి స్నేహం ఉండేది.

కార్యక్రమాలు రూపొందించడంలో ప్రభాకర్ ప్రతిభ గుర్తించిన సుమన్ తగిన ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. రామోజీరావు గారు ఈటివి ఛానల్ కు సంబంధించి తన టీమ్ కు మధ్యాన్నం 2 నుంచి 4 గంటల వరకు జరిగే ప్రసారాలకు అధికారం కట్టబెట్టారు. వాటిని అది మేనేజ్ చేసేది. వాటి వల్ల తర్వాత వచ్చే మన ప్రోగ్రాంస్ కు ఎఫెక్ట్ పడుతోందని ప్రభాకర్ సుమన్ కి చెప్పేశారు. రేటింగ్స్ కూడా ప్రభావితం చెందే ప్రమాదం ఉందని సున్నితంగా హెచ్చరించారు అయితే వెంటనే మార్చేయమని సుమన్ చెప్పడంతో ప్రభాకర్ ఆ మార్పులు చేర్పులు చేసేశారు. దీంతో రామోజీరావు గారికి సుమన్ గారికి మనస్పర్థలు ఏవో వచ్చాయి. సుమన్ తగ్గనని తేల్చి చెప్పేశారు. దీంతో ఎక్కడో షూటింగ్ లో ఉన్న ప్రభాకర్ ను తన ఆఫీస్ కు పిలిపించారు రామోజీరావు.

ఇలా చేయడం బాలేదని తమ తండ్రికొడుకుల మధ్య వస్తున్న విభేదాలకు నువ్వే కారణమని అబాంఢాలు వేశారు. రాజీనామా చేయాలి అనుకుంటే నన్నే సాకుగా చూపించి చేసేయమన్నారు. దీంతో ప్రభాకర్ వెంటనే సుమన్ దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పేసి బైబై చెప్పారు. దీంతో సుమన్ కు మొండిధైర్యంతో అయితే నాకూ ఆ ఛానల్ అక్కర్లేదని తెగేసి చెప్పారు. దీంతో వివాదం ముదిరి మొత్తం ప్రభాకర్ వల్లే జరిగిందనే ప్రచారం ఊపందుకుంది. తర్వాత ఎవరు ఏ నిజాలు ఎలా తెలుసుకున్నా చాలా చిన్న వయసులోనే సుమన్ అనారోగ్యంతో కన్ను మూయడం టీవీ అభిమానులను కలచి వేసింది. ఇదంతా జరిగాక ప్రభాకర్ వేరే ఛానల్స్ కు వెళ్ళిపోయి తన టాలెంట్ ని ఋజువు చేసుకుని ఆ తర్వాత సినిమా డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఏది ఏమైనా చిన్న అపార్థాలు ఎక్కడికో దారి తీస్తాయి అని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp