'మా' మెగాస్టార్ మద్దతు ఎవరికి ?

By iDream Post Jun. 22, 2021, 02:18 pm IST
'మా' మెగాస్టార్ మద్దతు ఎవరికి ?

టాలీవుడ్ కు గుండెకాయ లాంటి మా అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. దాసరి ఉన్నంతవరకు ఏకగ్రీవాలు నడిచాయి కానీ ఆయన పోయాక నువ్వా నేనా అంటూ ఎలెక్షన్లకు సిద్ధమవవడం మొదలయ్యింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్-మంచు విష్ణు మధ్య పోటీ గట్టిగానే ఉండబోతోందని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇద్దరికీ ఇండస్ట్రీ పెద్దగా నడిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి అండదండలు ఉండటమే అసలు ట్విస్ట్. నిజానికి మొన్నటి వరకు మంచు విష్ణు అధ్యక్షుడి పోటీకి నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు. మోహన్ బాబు ఉన్నా ఆశ్చర్యం లేదు కానీ అనుభవం తక్కువగా ఉన్న ఆయన వారసుడు రేస్ లోకి రావడం షాకే.

మంచుకు మెగాకు గతంలో ఏమో కానీ ఇటీవలి కాలంలో గట్టి అనుబంధం ఏర్పడింది. వ్యక్తిగతంగా మీటింగులు పెట్టుకుని మరీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అప్పుడెప్పుడో మనోజ్ గుంటూరోడు నుంచి లేటెస్ట్ మోహన్ బాబు కం బ్యాక్ మూవీ సన్ అఫ్ ఇండియా దాకా చిరంజీవి వీటికి వాయిస్ ఓవర్లు ఇస్తూనే ఉన్నారు. పరస్పరం కానుకలు ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రకాష్ రాజ్ అన్నయ్య అంటూ చిరుని ఎంతగా అభిమానిస్తాడో తెలియంది కాదు. టాలీవుడ్ లో మొదటి బ్రేక్ వచ్చిందే చూడాలని ఉంది సినిమాతో. అప్పటి నుంచి ఈ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. సో తనను చిరు నిర్లక్ష్యం చేస్తాడని అనుకోలేం.

ఇదంతా ఒక ఎత్తు అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన శివాజీరాజా సైతం నేను సైతం అంటూ పోటీకి రెడీ అవుతున్నాడు. పైన ఇద్దరికీ ఉన్నంత బ్యాక్ గ్రౌండ్ సెటప్ ఇతనికి లేకపోయినప్పటికీ కింది స్థాయి ఆర్టిస్టుల్లో సీనియర్లలో మంచి పేరుంది. అది ఎంత వరకు కాపాడుతుందో చూడాలి. అసలు చిరంజీవి వీళ్ళ ముగ్గురిలో ఎవరికి సపోర్ట్ ఇస్తారు ఎవరినైనా విత్ డ్రా చేయిస్తారా అనేది సస్పెన్స్ మూవీ క్లైమాక్స్ లా మారుతోంది. మెగా కాంపౌండ్ మాత్రం ఈ విషయంలో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంది. ఆచార్య షూటింగ్ పూర్తి చేయాల్సిన ఒత్తిడి ఇప్పుడు చిరు మీద ఉంది. మరి ఈ ఎలక్షన్ల వ్యవహారం ఎలా చక్కదిద్దుతారో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp