అలేఖ్య - అబిజీత్‌.. ‘బిగ్‌’ కెమిస్ట్రీ సీక్రెట్‌ ఏంటో.!

By Satya Cine Sep. 16, 2020, 12:58 pm IST
అలేఖ్య - అబిజీత్‌.. ‘బిగ్‌’ కెమిస్ట్రీ సీక్రెట్‌ ఏంటో.!
బిగ్‌బాస్‌ హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌ షురూ అయ్యిందా.? మోనాల్‌ గజ్జర్‌ - అబిజీత్‌ మధ్య కెమిస్ట్రీ తేడా కొట్టేసి.. అలేఖ్య హారిక - అబిజీత్‌ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్‌ అవుతోందా? ఓ వైపు అబిజీత్‌ - మోనాల్‌ - అఖిల్‌ మద్య ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ నడుస్తూనే, ఇంకోపక్క అబిజీత్‌ - అలేఖ్య మధ్య కూడా కెమిస్ట్రీ వర్కవుట్‌ అవుతుండడానికి కారణమేంటి? బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌కి కొత్త కొత్త డౌట్స్‌ చాలానే క్రియేట్‌ అవుతున్నాయి. ఇంకా చిత్రమైన విషయమేంటంటే, అఖిల్‌, అబిజీత్‌.. ఇద్దరూ ‘రెండో పులిహోర’ కూడా కలిపేస్తున్నారు.. అయితే, అది అలేఖ్యతో కావడం గమనార్హం. ఇవన్నీ జస్ట్‌ బిగ్‌ బాస్‌ హౌస్‌ వరకే పరిమితమని గతంలో జరిగిన సీజన్స్‌ నిరూపించేసినా, ఈసారి ఎందుకో కొంత డిఫరెంట్‌ కెమిస్ట్రీ కనిపిస్తోంది. మోనాల్‌ - అబిజీత్‌ మధ్య కెమిస్ట్రీ కోసం బిగ్‌బాస్‌ ఎంత ప్రయత్నిస్తున్నా అది డ్రమెటిక్‌గా మాత్రమే వుంటోంది. సేమ్ టు సేమ్ అఖిల్‌ - మోనాల్‌ విషయంలో కూడా. కానీ, మోనాల్‌ హీరోయిన్‌ కావడంతో, బిగ్‌బాస్‌ ఇంకా చాలా హోప్స్‌ పెట్టుకున్నట్టున్నాడు ఆ ముగ్గురి లవ్‌ ట్రాక్‌ విషయంలో. ఆ సంగతి పక్కనపెడితే, అబిజీత్‌ - అలేఖ్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అవుతోంది. ఆడియన్స్‌ బాగా ఈ ట్రాక్‌కి కనెక్ట్‌ అవుతున్నారు. అలేఖ్య, అబిజీత్‌కి అన్నం తినిపించడం సమా చాలా సన్నివేశాలు రక్తికట్టిస్తున్నాయి. మరోపక్క హౌస్‌లో మోనాల్‌తో పోల్చితే, అలేఖ్య చాలా ఎనర్జీ ప్రదర్శిస్తోంది. సో, ముందు ముందు అలేఖ్య బిగ్‌హౌస్‌లో మరింతగా హైలైట్‌ అయ్యే అవకాశాలున్నట్లే అర్థమవుతోంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp