విడుదల కోసం 'చెక్' స్ట్రాటజీ

By iDream Post Jan. 05, 2021, 06:57 pm IST
విడుదల కోసం 'చెక్' స్ట్రాటజీ

థియేటర్లు తెరుచుకున్నాయి కదా ఇక ఓటిటి ప్రభావం పూర్తిగా తగ్గుతుందని అనుకోవడానికి లేదు. గత ఏడాది అందివచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని ఫుల్ గా వాడుకున్న డిజిటల్ సంస్థలు అంత ఈజీ గా తగ్గేలా కనిపించడం లేదు. కొన్ని సినిమాలు గత ఏడాదే నిర్మాణంలో ఉన్న స్టేజిలోనే ఓటిటి డీల్ చేసుకోగా మరికొన్ని ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. నాగార్జున వైల్డ్ డాగ్ సైతం నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ ప్రీమియర్ కాబోతోందనే వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ న్యూస్ రావడం ఒక్కటే పెండింగ్. తాజాగా మరో క్రేజ్ ఉన్న మూవీ కూడా ఇదే దారిలో వెళ్లే అవకాశాలు ఉన్నట్టు సినీ వర్గాల సమాచారం.

ఇటీవలే టీజర్ విడుదలై అందరి దృష్టిలో పడ్డ నితిన్ చెక్ డిజిటల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. కాకపోతే క్రేజే ఆఫర్ అయితేనే ఒప్పుకునే దిశగా నిర్మాత చూస్తున్నట్టు వినికిడి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడ్డ ఖైదీగా నటిస్తున్నాడు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చిత్రాల్లో కమర్షియల్ అప్పీల్ తక్కువగా ఉంటుంది. ఒక వర్గానికి బాగా నచ్చినా సరే రెగ్యులర్ ఆడియన్స్ కి అంత సులభంగా కనెక్ట్ కావు. అలాంటి వాటికి ఓటిటి వేదికలు బెస్ట్ ఆప్షన్. అందుకే చెక్ ఫైనల్ అవుట్ ఫుట్ చూశాక ఆ దిశగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. కానీ టైం పట్టొచ్చు.

నితిన్ మరో సినిమా రంగ్ దే మార్చ్ 26 లాక్ చేసుకుంది. ఒకవేళ చెక్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని తర్వాత కనీసం రెండు నెలల గ్యాప్ వచ్చేలా చూసుకోవాలి. పోనీ ఈ నెల లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామా అంటే విపరీతమైన పోటీ. ఆల్రెడీ ఫిక్స్ అయిన సినిమాల మధ్య దిగడం లేనిపోని ఇబ్బంది. ఒకవేళ థియేటర్ కే కట్టుబడితే వేసవి దాకా ఆగాల్సి వస్తుంది. అప్పుడన్నీ గ్రాండియర్ భారీ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అదీ రిస్కే. ఎదురు చూసే కొద్దీ పెట్టుబడి మీద భారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చెక్ ని ఓటిటికి ఇవ్వడమే లాభదాయకంగా అనిపించవచ్చు. అధికారికంగా చెప్పేదాకా దేన్నీ ధృవీకరించలేని పరిస్థితి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp