చరణ్ ఎపిసోడ్ అలా సెట్ చేశారు

By iDream Post Aug. 10, 2020, 11:25 am IST
చరణ్ ఎపిసోడ్ అలా సెట్ చేశారు

ఇంకో ఐదు నెలలు గడిస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా వచ్చి రెండేళ్ళు అవుతుంది. వినయ విధేయ రామ డిజాస్టర్ తర్వాత ఆర్ఆర్ఆర్ కు కమిట్ కావడంతో ఇంకో ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ లేకపోయింది. అదీ ఏదో ఒక ఒక అవాంతరం వల్ల వాయిదా పడుతూనే ఉంది. తాజాగా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. దాంతో పాటు నాన్న చిరంజీవి నటిస్తున్న ఆచార్యలోనూ చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికింకా షూటింగ్ జరగలేదు కాని దర్శకుడు కొరటాల శివ దానికి సంబంధించి పక్కా ప్లానింగ్ తో ఒక మాస్ ఎపిసోడ్ డిజైన్ చేశాడట.

ప్రీ ఇంటర్వెల్ ముందు ప్రవేశపెట్టి తండ్రికొడుకులు కలుసునే సీన్ దగ్గర విశ్రాంతి కార్డు వేసి ఆ తర్వాత మరో అరగంట పాటు ఇది కొనసాగేలా చాలా బాగా సెట్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఒక పాట, రెండు ఫైట్లతో పాటు విడిగా ఓ హీరొయిన్ కూడా ఉంటుందని సమాచారం. ఇంకా ఎంపిక జరగలేదు. కీయరా అద్వానీ పేరు వినిపిస్తోంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తను ఒప్పుకుంటుందా లేదా చూడాలి. తనకు టాలీవుడ్ లో మొదటి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి శివ అడిగితే నో చెప్పకపోవచ్చు. ఇక చిరు చరణ్ లు స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఉన్నారు. గతంలో మగధీర, బ్రూస్లీ, ఖైది నెంబర్ 150లో కలిసి కనిపించినప్పటికీ అవన్నీ కథకు ఏ మాత్రం సంబంధం లేని క్యామియోలు. కాని ఆచార్యలో అలా ఉండదు. అందుకే ఆచార్య మీద ఆ రేంజ్ లో హైప్ ఉంది.

రామ్ చరణ్ అభిమానులు సైతం ఆర్ఆర్ఆర్ కంటే ముందు ఇదే రావాలని కోరుకుంటున్నారు కానీ ఇప్పటికైతే ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. హైదరాబాద్ లో కేసులు పూర్తిగా కంట్రోల్ కాకపోవడంతో పాటు స్వయానా రాజమౌళికే పాజిటివ్ గా రావడంతో షూటింగ్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. ఈలోగా ఆచార్యనే ఫినిష్ చేసే విధంగా జక్కన్నను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆచార్య ఫస్ట్ లుక్ చిరు పుట్టినరోజు ఆగస్ట్ 22 విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. 65వ పుట్టినరోజు కాబట్టి టీజర్ వదలాలని ఫ్యాన్స్ కోరుతున్నా ఆ రోజు వచ్చే దాకా ఏదీ ఖచ్చితంగా చెప్పలేం. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మెగా మూవీలో కాజల్ అగర్వాల్ హీరొయిన్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp