మిస్టర్ ఇండియా దర్శకుడిపై మాజీ భార్య కేసు

By iDream Post Mar. 10, 2020, 01:56 pm IST
మిస్టర్ ఇండియా దర్శకుడిపై మాజీ భార్య కేసు

బాలీవుడ్ కమర్షియల్ సినిమాని ఒక కొత్త కోణంలో ఆవిష్కరించిన మిస్టర్ ఇండియా సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ అనే చెప్పొచ్చు. మన జగదేకేవీరుడు అతిలోకసుందరికి ఇదే ఇన్స్ పిరేషన్. దర్శకుడు శేఖర్ కపూర్ పేరు ఆ సమయంలోనే మారుమ్రోగిపోయింది. అనిల్ కపూర్, శ్రీదేవిల స్టార్ డంను ఇంకొన్ని మెట్లు పైకెక్కించిన మిస్టర్ ఇండియాని వివిధ భాషల్లో రీమేక్ చేసి మరీ బాగ్యరాజా, అంబరీష్ లాంటి స్టార్ హీరోలు హిట్లు అందుకున్నాడు.

ఇక శేఖర్ కపూర్ తీసిన బండిట్ క్వీన్ గురించి చెప్పాలంటే ఇక్కడ స్పేస్ సరిపోదు. పూలన్ దేవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రా అండ్ రస్టిక్ గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో రేపిన వివాదాలు, సంచలనాలు అన్ని ఇన్ని కావు. అలాంటి విలక్షణ దర్శకుడిపై మాజీ భార్య నటి కం గాయని సుచిత్రా కృష్ణమూర్తి కేసు పెట్టడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీళ్లిద్దరికీ 1999లో పెళ్లయింది. కావేరి అనే కూతురు కలిగాక 2007లో ఏవో మనస్పర్థల వల్ల విడాకులు తీసుకున్నారు. ఇప్పటి వివాదానికి వస్తే తన కూతురికి చెందాల్సిన ఆస్తిలో భాగంగా ఉన్న ప్రాపర్టీలో సీనియర్ నటుడు కబీర్ బేడీ ఉంటున్నారని ఆమె కోర్ట్ లో కేసు ఫైల్ చేసింది.

కానీ లీగల్ గా అగ్రిమెంట్ చేసుకున్నాకే తాను అందులో ఉంటున్నానని బేడీ వాదన. మొత్తానికి శేఖర్ కపూర్ ఇప్పుడు స్నేహితుడికి మాజీ భార్యకు మధ్య ఇరుక్కుపోయాడని బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. బాండిట్ క్వీన్ తరవాత హిందీ సినిమాలకు దర్శకత్వం వహించడం మానేసిన శేఖర్ కపూర్ తనదగ్గరకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ తిరస్కరిస్తూ వచ్చాడు.2008 తర్వాత ఇంకే సినిమా చేయలేదు. యాక్టర్ గా మాత్రం కమల్ హాసన్ విశ్వరూపం రెండు భాగాల్లోనూ కీలక పాత్ర చేశాడు. ఆపై మళ్ళీ కనిపించలేదు. తాజాగా మిస్టర్ ఇండియా సీక్వెల్ కు ప్లానింగ్ జరుగుతోంది. కానీ దర్శకుడు శేఖర్ కపూర్ కాదు. మూడు భాగాలుగా కొత్త సిరీస్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు బోనీ కపూర్ ఇటీవలే ప్రకటించాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp