అందరికంటే ముందు పవన్ ?

By iDream Post May. 27, 2020, 11:52 am IST
అందరికంటే ముందు పవన్ ?

ఇంకొద్ది రోజుల్లో ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా షూటింగులు ప్రారంభం కాబోతున్నాయి. గైడ్ లైన్స్ కొంచెం సంక్లిష్టంగా ఉండటంతో అమలులో ఎంత వరకు ఖచ్చితత్వం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. మరోవైపు థియేటర్లు తెరవడం గురించి సెంట్రల్ గవర్నమెంట్ కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. బహుశా జూలై చివరి వారం లేదా ఆగష్టు నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగా ఎవరి సినిమా రిలీజ్ చేయాలనే దాని మీద సస్పెన్స్ విపరీతంగా ఉంది.

ఎందుకంటే జనం వస్తారో రారో అని తెలియడానికి ఫస్ట్ విడుదలయ్యే మూవీనే ఎక్స్ పరిమెంట్ గా ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎప్పటి లాగా ఉందంటే మిగిలిన నిర్మాతలకు ధైర్యం వస్తుంది. అందుకే స్టార్ హీరోది అయితేనే ఇది విజయవంతం చేయగలమని భావించిన ప్రొడ్యూసర్ గిల్డ్ వకీల్ సాబ్ ని త్వరగా పూర్తి చేసి థియేటర్లలో ముందు పంపేలా నిర్మాత దిల్ రాజు మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా టాక్. ఇప్పటికే ఆయన వద్ద నాని వి స్ట్రక్ అయిపోయింది. ఒకవేళ అదే విడుదల చేద్దామన్నా రిస్క్ అవుతుంది. నానికి మార్కెట్ ఉంది కాని మరీ పబ్లిక్ ని బెనిఫిట్ షోలకు రప్పించే రేంజ్ కాదు. అది కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తేనే నాని పాతిక కోట్ల దాకా వసూళ్లు రాబడతాడు.

కాని పవన్ లాంటి హీరోలు అలా కాదు. రిపోర్ట్స్ తో సంబంధం లేకుండా మొదటి వారం రోజులు హౌస్ ఫుల్ చేయించే సత్తా ఉంటుంది. ఎలాగూ నాలుగు నెలలు జనం సినిమా హాళ్ళకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ రకంగా కూడా మోటివేట్ కావడానికి పవర్ స్టార్ సినిమా ఉపయోగపడుతుంది. మరి దిల్ రాజు ఆలోచన ఎలా ఉందో వేచి చూడాలి.వకీల్ సాబ్ కు మొత్తం కలిపి మహా అయితే ఓ నెల రోజుల షూటింగ్ బాలన్స్ ఉంది. బల్క్ డేట్స్ దొరికితే ఇంకా వేగంగా పూర్తి చేయొచ్చు. ఎలాగూ ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉంటాయి. సో మరి అందరి కన్నా ముందు పవన్ బరిలో దిగుతాడా లేదా లెట్ వెయిట్ అండ్ సి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp