రిలీజ్ మార్పు వెనుక ఎన్నో లెక్కలు

By iDream Post Aug. 29, 2021, 10:44 am IST
రిలీజ్ మార్పు వెనుక ఎన్నో లెక్కలు

నిన్న గోపీచంద్ సీటిమార్ విడుదల తేదీని సెప్టెంబర్ 3 నుంచి 10కి మార్చి అధికారిక ప్రకటన ఇచ్చేశారు. నాగ చైతన్య లవ్ స్టోరీ మరోసారి వాయిదా పడటంతో ఆ పండగ డేట్ ని వదులుకోవడం ఇష్టం లేక ఇలా లాక్ చేసుకున్నారు. దీనికి కారణాలు చూసుకుంటే మొదటిది ఏపిలో ఇంకా తేలని టికెట్ రేట్ల వ్యవహారం. రెండోది సెకండ్ షోలకు అనుమతి లేకపోవడం. మూడోది రివ్యూలు పబ్లిక్ టాకులు ఎంత బాగున్నా వసూళ్లు మాత్రం మరీ అంత భారీగా దేనికీ రాకపోవడం. ఒక్క ఎస్ఆర్ కళ్యాణమండపం మాత్రమే 8 కోట్ల షేర్ దాటగలిగింది. పాగల్ కు ఇది సాధ్యం కాలేదు. రాజరాజ చోర ఫైనల్ రన్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడే దాని గురించి చెప్పలేం.

ఇక శ్రీదేవి సోడా సెంటర్ ఓపెనింగ్స్ కూడా మరీ గ్రాండ్ గా ఏమి లేవు. ఇచట వాహనములు నిలుపరాదు డిజాస్టర్ కాగా హౌస్ అరెస్ట్ కూడా జనానికి పెద్దగా చేరలేదని ట్రేడ్ రిపోర్ట్. ఇక డబ్బింగ్ సినిమాల గురించి చెప్పేందుకు ఏమి లేదు. ఇక 3వ తేదీ విషయానికి వస్తే సీటిమార్ ఆ డేట్ కి వస్తే ఎంతో కొంత రిస్క్ లేకపోలేదు. వచ్చే వారంలో టాలీవుడ్ ప్రముఖులు ఏపి సిఎం జగన్ ని కలవబోతున్న తరుణంలో సెకండ్ వీక్ నుంచి సడలింపులు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అదే కనక జరిగితే 10న వచ్చే సీటిమార్ కు చాలా ప్లస్ అవుతుంది. ఎలాగూ ఫెస్టివల్ హాలిడే ప్లస్ వీకెండ్ రెండూ కలిసి వస్తాయి. సో అంతా ప్లాన్ ప్రకారమే వాయిదాల పర్వానికి తెరతీశారు.

సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో క్రీడా నేపధ్యమే అయినప్పటికీ మాస్ ని అలరించే అంశాలు అన్నీ రూపొందించినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమయ్యింది. మరి ఆ స్థాయిలో కంటెంట్ ఉంటే బుకింగ్ కౌంటర్లను బాగా బిజీగా మార్చే సినిమా ఇదే అవుతుంది. గోపీచంద్ చాలా ఏళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది కనక వర్కౌట్ అయితే నెక్స్ట్ మారుతీతో చేస్తున్న పక్కా కమర్షియల్ కు బిజినెస్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది.సెకండ్ లాక్ డౌన్ తర్వాత రాబోయే భారీ చిత్రం కూడా ఇదే అవ్వబోతోంది

Also Read : జూనియర్ మణిశర్మకు మెగా ఛాన్స్ ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp