బన్నీ 'నో' మరి ఎవరు 'ఎస్'

By iDream Post Aug. 04, 2020, 11:39 am IST
బన్నీ 'నో' మరి ఎవరు 'ఎస్'

ఏ ముహూర్తంలో అల్లు అర్జున్ నా పేరు సూర్య ఒప్పుకున్నాడో గానీ దాని ఫలితం దెబ్బకు ఏకంగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కాకపోతే అల వైకుంఠపురుములో ఊహించని స్థాయిలో నాన్ బాహుబలి రికార్డులు కొట్టడంతో అందరూ లోటుని మర్చిపోయారు. స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేడు. ట్రాక్ రికార్డు ఉన్న స్టార్ డైరెక్టర్లతోనే ఏరికోరి మరీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. సుకుమార్ తో చేస్తున్న పుష్ప త్వరలోనే పునఃప్రారంభించబోతున్నారు. స్వీట్ సర్ప్రైజ్ గా మొన్న కొరటాల శివతో మూవీ అనౌన్స్ చేయించాడు బన్నీ.

ఇవన్ని అభిమానులకు మాములు జోష్ ఇవ్వడం లేదు. అయితే గతంలోనే దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ ఓకే చేసిన ఐకాన్ అనే సినిమా ఒకటి పెండింగ్ లో ఉండిపోయింది. అది ఇప్పుడు పట్టాలు ఎక్కే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ టాక్. వకీల్ సాబ్ టేకప్ చేసిన వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఐకాన్ ని వేరే స్టార్ తో తీసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు వినికిడి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ కథ వినిపించాలని డిసైడ్ అయ్యారట. అయితే తారక్ ఫ్రీగా లేడు. ఇప్పుడు చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో జాయిన్ అవ్వాలి. దానికో ఆరు నెలలు పైగా కావాలి. నెక్స్ట్ కేజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ ఉన్నాడు. మైత్రి బ్యానర్ లో ఇది రూపొందుతుందని టాక్ ఉంది కానీ ఇప్పటికైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.

ఇక చరణ్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత ఇంకెవరికి కమిట్ కాలేదు. గౌతం తిన్ననూరి చెప్పిన లైన్ నచ్చిందని ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని వినికిడి. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ప్రకటన రావొచ్చు. ఖచ్చితంగా అయితే చెప్పలేం. వీటి సంగతి ఎలా ఉన్నా అసలు సందేహం ఏమిటంటే అల్లు అర్జున్ వద్దన్న స్టొరీని వీళ్ళు కాని ఇంకెవరైనా కానీ ఒప్పుకుంటారా అని. అయితే పరిశ్రమలో ఇలాంటివి చాలా జరిగాయి. గతంలో అతడు, పోకిరి, ఇడియట్ లాంటి కథలు ముందు పవన్ దగ్గరికి వెళ్లినవే. సో ఒకరు నో చెప్పినంత మాత్రాన ఇంకొకరికి సెట్ కాదన్న రూల్ ఏమి లేదు కాబట్టి ఐకాన్ ఎవరి చేతుల్లో పడుతుందో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp