బిగ్ బాస్ 4 - ఎవరికి ఎంత రెమ్యునరేషన్

By iDream Post Sep. 16, 2020, 11:52 am IST
బిగ్ బాస్ 4  - ఎవరికి ఎంత రెమ్యునరేషన్

చాలా అంచనాల మధ్య మొదలైన బిగ్ బాస్ 4 మరీ గొప్పగా అయితే సాగడం లేదు. వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో అంత జోష్ కనిపించడం లేదు. సెలబ్రిటీలని తీసుకొచ్చి పెద్దగా పరిచయం లేని వాళ్ళతో గేమ్ ఆడించడం కూడా ప్రభావం చూపిస్తోంది. లాస్య, గంగవ్వ తప్ప ఇంకెవరు అంతగా లైం లైట్ లో లేనివాళ్ళే. ఎంత ఆట అయినా ఇదంతా పారితోషికం తీసుకుని చేసే పనే. ఎవరికి ఎంత వస్తుందనే ఆసక్తి ఉండటం సహజం. అధికారికరంగా వచ్చిన సమాచారం కాదు కానీ టీవీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే అందరు పార్టిసిపెంట్స్ కి రోజు వారి రెమ్యునరేషన్ ఉంటుందట. అగ్రిమెంట్ ప్రకారం హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. చివరి వారం దాకా ఉండెవాళ్ళ పంట పండుతుందన్న మాట.

దాని ప్రకారం అత్యధికంగా లాస్య రోజుకు 1 లక్ష ప్రకారం డీల్ జరిగిందని సమాచారం. అమ్మ రాజశేఖర్ కు 60 నుంచి 80 వేల మధ్యలో, అందరి చూపుతో సానుభూతి వచ్చేలా చేసుకున్న గంగవ్వకు 25 వేలు, మోనాల్ గుజ్జర్- నోయల్ లకు విడివిడిగా 50 వేలు, ఆల్రెడీ వెళ్ళిపోయిన సూర్యకిరణ్ కు 50 వేలు, అభిజిత్ కు 20 వేలు, జోర్దార్ సుజాత-మెహబూబ్-సోహైల్- అఖిల్-అరియనా-కుమార్ సాయిలకు చెరో 10 వేలు, టీవీ9 దేవి-దేత్తడి హారిక-కరాటే కళ్యాణి-దివిలకు చెరో 25 వేలు లెక్కన అమౌంట్ మాట్లాడుకున్నారట. హౌస్ లోకి వచ్చిన సభ్యుల ఇమేజ్, వాళ్ళు ప్రస్తుతం ఉన్న వృత్తి ప్లస్ సంపాదన, బయట సోషల్ మీడియాలో వాళ్లకున్న పాపులారిటీ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఇవి ఫిక్స్ చేసినట్టు తెలిసింది.

అఫీషియల్ గా ఇవన్నీ బయటికి చెప్పరు కాబట్టి ఈ ఫిగర్స్ ని కన్ఫర్మ్ గా చెప్పలేం కానీ ఇంచుమించు వీటికి దగ్గరగా అయితే ఉంటాయి. మూడు సీజన్లకు మించి భారీ బడ్జెట్ తో సెట్టింగుతో దీన్ని నిర్వహిస్తున్న స్టార్ మా రేటింగ్స్ పరంగా ఎన్నో అంచనాలు పెట్టుకుంది. నాగార్జునకు ఎంత అనేది బయటికి రాలేదు కానీ నెవర్ బిఫోర్ అమౌంట్ అనేది మాత్రం వాస్తవం. ఇప్పటికి పది రోజులు మాత్రమే పూర్తయిన బిగ్ బాస్ 4కి ఇంకా 90 రోజుల గేమ్ మిగిలి ఉంది. మధ్యలో ఎలిమినేషన్లు, వైల్డ్ కార్డు ఎంట్రీలు, గొడవలు, వివాదాలు చాలా రాబోతున్నాయి. ఇప్పుడున్న తరహాలో సాగితే ముందు ముందు కష్టమే అని గుర్తించిన నిర్వాహకులు వీలైనంత మసాలా జోడించేందుకు స్క్రిప్ట్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. టిఆర్పిని నమ్ముకుని ఇంత ఖర్చుతో సాగుతున్న బిగ్ బాస్ 4 నుంచి ప్రేక్షకులు ఇంకా చాలా ఆశిస్తున్నారు. ఇకపైనైనా దానికి తగ్గట్టు షో సాగుతుందేమో చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp