బిగ్‌బాస్‌ షో ఇలా అయిపోయిందేంటీ?

By Satya Cine Sep. 16, 2020, 03:22 pm IST
బిగ్‌బాస్‌ షో ఇలా అయిపోయిందేంటీ?
బిగ్‌బాస్‌ రియాల్టీ షో నాలుగో సీజన్‌కి సంబంధించి ఎలాంటి ఏడుపులూ లేని ఎపిసోడ్‌ నిన్ననే ప్రసారమయ్యింది. ఏడుపుగొట్టు సీన్లతో ఇప్పటిదాకా బోర్‌ కొట్టించేసిన బిగ్‌బాస్‌, అస్సలు చిన్నపాటి గొడవ కూడా లేకుండా.. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిన్నటి ఎపిసోడ్‌ని తీర్చి దిద్దడం గమనార్హం. దేవి నాగవల్లి చుట్టూ చిన్నపాటి డిస్కషన్‌ జరగడం మినహాయిస్తే, నిన్నటి ఎపిసోడ్‌ అంతా పూర్తిస్థాయి ఫన్‌తో నిండిపోయింది. మరీ ముఖ్యంగా అలేఖ్య హారిక ఇచ్చిన హాట్‌ పెర్ఫామెన్స్ నిన్నటి ఎపిసోడ్‌ మొత్తానికీ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. మేగ్జిమమ్ గ్లామర్‌ని అలేఖ్య చూపించేసింది తనకి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ. మెహబూబ్‌ దిల్‌ సే కండల ప్రదర్శన, వెయిట్‌ లిఫ్టింగ్‌ వ్యవహారాలూ బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చాయి. ఇక, టీవీ సీరియల్‌ కాన్సెప్ట్‌ కూడా బాగానే వర్కవుట్‌ అయ్యింది. అందులో దివి పెర్ఫామెన్సుకి ఎక్కువ మార్కులు పడ్డాయి. దేవి నాగవల్లి - కుమార్‌ సాయి మధ్య ట్రాక్‌ ఆ సీరియల్‌కి మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇక, సీరియల్‌ కంటే బాగా వర్కవుట్‌ అయ్యింది.. మధ్యలో వచ్చిన ప్రకటనలు. ఆ ప్రకటనల్లో చీపురు, విగ్గుల ప్రమోషన్‌ అదిరింది. నోయెల్‌, హారిక, గంగవ్వ, లాస్య, అమ్మ రాజశేఖర్‌ తదితరులు ఈ ప్రకటనల్లో తమ టాలెంట్‌ ప్రదర్శించేశారు ఓ రేంజ్‌లో. ఓవరాల్‌గా నిన్నటి ఎపిసోడ్‌ బిగ్‌ బాస్‌ వ్యూయర్స్‌కే షాకిచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ అదిరిపోయిందిగానీ, కొట్లాటలు లేకపోతే అది రియాల్టీ షో ఎలా అవుతుంది? అని ప్రశ్నిస్తున్నవారూ లేకపోలేదు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp