పిల్లల డే కేర్ సెంటర్ గా మారిన బిగ్ హౌస్

By iDream Post Oct. 28, 2020, 11:38 am IST
పిల్లల డే కేర్ సెంటర్ గా మారిన బిగ్ హౌస్

వీకెండ్లో వచ్చే నామినేషన్ ఎపిసోడ్లకు వస్తున్న స్పందన మిగిలిన రోజుల్లో కూడా తెప్పించేందుకు బిగ్ బాస్ వేస్తున్న ఎత్తుగడలు మాములుగా లేవు. ఇమేజ్ లేని సభ్యులు కావడంతో వాళ్ళ నుంచి వీలైనంత డ్రామా రాబట్టుకోవడానికి గట్టి ప్లాన్స్ వేస్తున్నాడు. మొన్నటి నుంచి కొత్త నామినేషన్లు మొదలుకావడంతో పార్టిసిపెంట్స్ కూడా తమ స్థాయికి తగ్గట్టు రక్తి కట్టించేందుకు ఎన్ని చేయాలో అంతా చేస్తున్నారు. మోనాల్ ని కేంద్రబిందువుగా మార్చి రోజూ తన టాపిక్ లేనిదే ఏదో ఎవరూ చూడరు అనే తరహాలో అవసరానికి మించి ట్రయాంగిల్ లవ్ స్టోరీని సాగదీస్తూనే ఉన్నారు . నిన్న కూడా అభిజిత్ అఖిల్ మోనాల్ లమధ్య చర్చల రూపంలో ఇది కొనసాగింది.

నామినేషన్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మ రాజశేఖర్ ఏడ్చేశారు. హౌస్ లో జరుగుతున్న పరిణామాలు తనను బాధ పెడుతున్నాయని శోకాలు పెట్టేశారు. దీంతో సోహైల్, మెహబూబ్ లు ఓదార్చడానికి కష్టపడాల్సి వచ్చింది. అవినాష్ వేసిన కామెడీ ట్రాప్ లో మోనాల్ పడిపోయి అతనికి నుదుటి మీద ముద్దు పెట్టడం ఇవాళ జరిగిన ఆణిముత్యం లాంటి సన్నివేశం. దీన్ని సరిగ్గా వాడుకుని అఖిల్ ని ఉద్దేశించి టీజ్ చేశాడు అవినాష్. అతనూ కౌంటర్ ఇస్తూ హీరొయిన్ కమెడియన్ కు ముద్దు ఇచ్చినట్టు ఉందని చెప్పడం ట్విస్ట్. ఇదంతా సరదాగానే సాగింది. ఆ తర్వాత మొదలైంది అసలైన టాస్క్

బీబీ డే కేర్ పేరుతో హౌస్ మేట్స్ ని చిన్నపిల్లలుగా, వాళ్ళను చూసుకునే కేర్ టేకర్స్ గా రెండు గ్రూపులుగా విడగొట్టారు. చిల్ద్రెన్ టీంలో అవినాష్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, హారిక ఉండగా మిగలిన వాళ్ళు నోయెల్, అభిజిత్, మోనాల్, అఖిల్, సోహైల్ లు కేర్ టేకర్స్ బృందంలో ఉన్నారు. ఇందులో బాగానే రచ్చ జరిగింది. పిల్లలుగా ఉన్న సభ్యులు కేర్ టేకర్స్ తో ఫుల్ గా ఆడుకున్నారు. అరియానా దొరికిన ఛాన్స్ వాడుకుని సోహైల్ తో ఆటాడుకుంది. హారిక సైతం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. పిల్లలు ఏడ్చినప్పుడల్లా బట్టలు, డైపర్లు మార్చాలి. కొందరు మారాం చేయగా అమ్మ రాజశేఖర్ మాత్రం అల్లరి చేయకుండా గమ్మున వేయించుకున్నారు. ఇవాళ కూడా ఇది కొనసాగించే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp