టోపీలు శవపేటికలు - కొత్త టైపు నామినేషన్లు

By iDream Post Nov. 24, 2020, 12:50 pm IST
టోపీలు శవపేటికలు - కొత్త టైపు నామినేషన్లు

ఊహించని విధంగా మొన్న లాస్య ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ 4 కొత్త మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. దీని పట్ల తన అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ భేతాళ ప్రశ్న లాంటి ఓటింగ్ సిస్టం గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. ఇక 12వ వారంలో విజయవంతంగా అడుగు పెట్టిన మిగిలిన ఏడుగురు పార్టిసిపెంట్స్ షో ఇక పాతిక రోజుల కంటే ఎక్కువ లేదని గుర్తించి దానికి తగ్గట్టే తమ మెడ మీద కత్తి పడకుండా జాగ్రత్త పడుతున్నారు. లాస్య లేదు కనక కిచెన్ డ్యూటీ పడటంతో అభిజిత్, సోహైల్ లు వంటల ప్రోగ్రాం అందుకున్నారు. అయితే దోసెలు పోసేందుకు అభిజిత్ పడిన ఇబ్బందిని సోహైల్ ఆట పట్టించాడు.

ఇక లైలా మజ్ను రేంజ్ లో ముందు నుంచి హై లైట్ అవుతూ వచ్చిన ప్రేమ జంట మోనాల్, అఖిల్ ల మధ్య కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ముందుగా అఖిల్ ఓపెన్ అవుతూ బాగా స్ట్రాంగ్ అవుతున్న టైంలో నీతో రిలేషన్ తన గేమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తోందని ఇకపై ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ దూరం కొనసాగిస్తానని తేల్చి చెప్పాడు. ఇక మోనాల్ తన వెర్షన్ వినిపిస్తూ ఎప్పటిలాగే కొళాయి తిప్పేసి కన్నీళ్లు కార్చేసింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఏడుపే పనిగా పెట్టుకున్న మోనాల్ నిజంగా ఎమోషనల్ అవుతున్న సందర్భాల్లోనూ నాటకీయత అనిపించే పరిస్థితిని తెచ్చుకుంది. మొత్తానికి ఇద్దరూ వాళ్ల వాదనలు చెప్పుకున్నారు.

ఇక టాస్కుల్లో భాగంగా ముందుగా టోపీల కాన్సెప్ట్ ఇచ్చారు. పరుగున వెళ్లి వాటిని అందుకున్న కారణంగా సోహైల్, మోనాల్ లు సేఫ్ అయ్యారు. అభిజిత్, అరియానా, అఖిల్, అవినాష్ లు నామినేట్ అయ్యారు. ఇక్కడా మోనాల్ మళ్ళీ ట్యాప్ తిప్పింది. తర్వాత మిగిలిన నలుగురికి శవపేటిక టాస్కు పెట్టారు. దీంట్లో పెట్టిన ఓ చిత్రమైన కండిషన్ వల్ల అవినాష్, మోనాల్ ల మధ్య కాసేపు హాట్ ఆర్గుమెంట్ జరిగింది. అరియానాతో కూడా మోనాల్ కు వాదోపవాదాలు జరిగాయి. సోహైల్, అఖిల్ ల మధ్య మంచి డ్రామా నడిచింది. ఇలా ఈ శవపేటికల ట్రాక్ రకరకాల మలుపులు తిరిగి మోనాల్, అఖిల్, అవినాష్, అరియానాను ఫైనల్ నామినేషన్స్ గా ప్రకటించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp