కొత్త కెప్టెన్ హారిక - లాస్య ఫ్యామిలీ ఎమోషన్

By iDream Post Nov. 21, 2020, 02:30 pm IST
కొత్త కెప్టెన్ హారిక - లాస్య ఫ్యామిలీ ఎమోషన్

గత మూడు రోజులుగా ఒకరు లేదా ఇద్దరి పార్టిసిపెంట్స్ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి హౌస్ ని ఫుల్ ఎమోషనల్ చేస్తున్న బిగ్ బాస్ నిన్న కూడా అదే కొనసాగించాడు. ఈసారి లాస్య వంతు వచ్చింది. తన గారాల పట్టి జున్నుతో కలిసి భర్త మంజునాథ్ అక్కడికి వచ్చాడు. మాములుగా వీళ్ళను తల్చుకుంటేనే ఏడ్చే లాస్య ఏకంగా వాళ్ళను నేరుగా చూసేసరికి కన్నీళ్ళను కంట్రోల్ చేసుకోలేకపోయింది. మాట్లాడుతున్నంత సేపూ తన కళ్ళు వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. నన్ను వదిలి ఉండగలవా జున్ను అంటూ పదే పదే అడిగినా బాబు మాత్రం చక్కగా నవ్వుతూ గడిపి వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా ఉండటం గమనార్హం.

మంజునాథ్ తన భార్యకు ధైర్యం చెప్పాడు. కిచెన్లో ఎక్కువ గడపకుండా బయటికి వచ్చి గేమ్ ఆడాలని డెబ్భై రోజులు కొనసాగడం అంటే ఎంతో గొప్ప విషయమని స్ఫూర్తినిచ్చాడు. నేను లేకుండా ఉండగలవా అనే లాస్య అతన్ని కూడా అడిగింది. ఉంటాననే సమాధానమే వచ్చింది. అయినా అన్ని తెలిసి పేరు, పారితోషికం కోసం ఫ్యామిలీని వదిలి వచ్చినప్పుడు మళ్ళీ అదే పనిగా నన్ను వదిలి ఉండగలరా అని అడగటం కేవలం ఎమోషన్ ని క్రియేట్ చేయడం కోసమే. అలా లాస్య ఎపిసోడ్ సాగింది. లగ్జరీ టాస్క్ లో భాగంగా అవినాష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సోహైల్, లాస్య, అభిజిత్, మోనాల్ లు ఫ్రిడ్జ్ నుంచి చాలా ఐటమ్స్ తీసుకున్నారు.

ఇక అఖిల్ నుంచి కెప్టెన్ షిప్ హారికకు వచ్చింది. గత కొన్ని వారాలుగా అబ్బాయిలే కెప్టెన్ గా ఉంటున్న తరుణంలో హారిక ఎంపిక కావడం ట్విస్ట్. ఈ టాస్కులో భాగంగా ఇంటి సభ్యులను ఒప్పించి పోటీదారులుగా ఉన్న అఖిల్, అభిజిత్, హారికలు వాళ్ళ భుజాల మీద కూర్చోవాలి. చివరిదాకా ఎవరు కింద దిగకుండా పడకుండా తట్టుకుంటారో వాళ్ళే విన్నర్. ఫైనల్ గా మోనాల్ భుజాల మీద ఉన్న హారిక గెలిచింది. అఖిల్ కెప్టెన్సి పోయినందుకు తెగబాధపడ్డాడు. ఇక ఇవాళ నాగార్జున ఎంట్రీతో కొత్త ఎలిమినేషన్ ఉంటుంది. రేపు ఎవరు బయటికి వెళ్తారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp