అఖిల్ అభిజిత్ కోల్డ్ వార్ - ఆమేనా ఎలిమినేటర్

By iDream Post Nov. 22, 2020, 11:58 am IST
అఖిల్ అభిజిత్ కోల్డ్ వార్ - ఆమేనా ఎలిమినేటర్

ఈ వారమంతా హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి కేటాయించిన బిగ్ బాస్ 4 నిన్నటితో ఎలిమినేషన్ ప్రక్రియకు వచ్చేసింది. మధ్యాన్నం నుంచే లాస్య ఎలిమినేట్ అయినట్టుగా లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్న కొడుకు జున్ను భర్త మంజునాథ్ కోసం విపరీతంగా ఏడ్చిన లాస్య ఇక ఇంటికి వెళ్లి హ్యాపీగా పూర్తి సమయం వాళ్ళతోనే గడపొచ్చని ఇతర పార్టిసిపెంట్స్ అభిమానులు కామెంట్లు కూడా పెడుతున్నారు. అది ఇవాళ ఖరారుగా చూపించే దాకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేం. మొత్తానికి మోనాల్ ని రక్షించే బృహత్తర కార్యక్రమం మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతోంది.

మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న అఖిల్ అన్న బబ్లూ హౌస్ లోకి వచ్చాడు. అతన్ని నాగార్జున టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో చెప్పమని అడిగినప్పుడు ఊహించని విధంగా సోహైల్ ఫోటో పెట్టడంతో అఖిల్ ఖంగు తిన్నాడు. తర్వాత తమ్ముడికి స్థానం ఇచ్చి బద్ధ శత్రువుగా భావిస్తున్న అభిజిత్ తన ఫేవరేట్ అని చెప్పడంతో కొత్త ట్విస్టు వచ్చి పడింది. దీనికి అఖిల్ షాక్ కొట్టిన ఎక్స్ ప్రెషన్ పెట్టగా అభిజిత్ సైతం ఆశ్చర్యపోయాడు. ఇదంతా గేమ్ లో భాగమని ఇద్దరూ సర్దిచెప్పుకున్నారు. బబ్లూ కొడుకు ఆరుష్ కూడా విచ్చేశాడు. ముద్దుముద్దు మాటలతో ఆకట్టుకున్నాడు. ఇదంతా ఫ్యాన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది.

ఇక మిగిలిన సంగతులు చూస్తే నాగార్జున ఈసారి మోనాల్, లాస్య, అఖిల్ ఏడుపుల ప్రస్తావన తెచ్చారు. ఓ చిన్న క్వశ్చన్ టాస్క్ పెట్టి అందులో గెలిచిన హారికకు నేరుగా ఫామిలీతో మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. వాళ్లకు కూడా బబ్లూ తరహాలో ఫోటో కాంటెస్ట్ పెట్టి టాప్ 5 ఎంచుకోమన్నారు. అభిజిత్ అఖిల్ ల మధ్య గొడవలను ఎలా పరిష్కరించాలో అర్థం కావడం లేదని నాగార్జున ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. ఇలా మొత్తంగా వీకెండ్ ఓ మాదిరిగా గడిచిపోయింది. నాగార్జున వచ్చినప్పుడే అఖిల్ కుటుంబ సభ్యలను తీసుకొచ్చే ప్లాన్ చూస్తుంటే అతనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోందని కొందరు అంటున్న మాటల్లో నిజం లేకపోలేదేమో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp