బిగ్‌బాస్ అలీరెజాకు సినిమా చాన్స్‌

By Sodum Ramana 22-11-2019 06:28 PM
బిగ్‌బాస్ అలీరెజాకు సినిమా చాన్స్‌

బిగ్‌బాస్‌-3 కంటెస్టెంట్ అలీరెజాకు సినిమా చాన్స్ ద‌క్కింది. ఏకంగా అగ్ర‌హీరో నాగార్జున సినిమాలో న‌టించే అవ‌కాశం ల‌భించింది. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా సినిమా ప్లాన్ చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో విశాఖ‌ప‌ట్నంలో అలీరెజాతో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ తీయ‌బోతున్నారు.
బిగ్‌బాస్‌-3లో అలీరెజా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌. అయితే ఐదోవారంలోనే ఆయ‌న ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు నోచుకోక‌పోవ‌డంతో ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింది. అయితే స్టార్‌మా యాజ‌మాన్యం తిర‌గి బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా అలీరెజాకు అవ‌కాశం ఇవ్వ‌డం తెలిసిందే.
టాప్-5 కంటెస్టెంట్ల‌లో అలీరెజా కూడా ఉన్నాడు. టాస్క్‌ల్లో ఎలాంటిదైనా అలీరెజా జీవించేవాడు. కాస్త ఆవేశ‌పరుడైనా ప‌ట్టుద‌ల మ‌నిషిగా పేరు సంపాదించాడు. అలాగే చ‌క్క‌టి ఫిజిక్‌తో గ్లామ‌ర్ బాయ్‌గా అంద‌రి దృస్టిలో ప‌డ్డాడు.

బిగ్‌బాస్ హౌస్‌లో ఉండ‌గా న‌ట‌న‌పై త‌న ఆస‌క్తిని వెల్ల‌డించాడు. అంతే కాకుండా ప‌లు సంద‌ర్భాల్లో అత‌ను డ్యాన్స్‌, న‌ట‌న‌లో త‌న‌దైన శైలిలో ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకున్నాడు.

హోస్ట్ నాగార్జున సైతం అలీరెజా న‌ట‌న‌కు ఫిదా అయ్యాడు. ఇప్పుడు నాగార్జున హీరోగా తీస్తున్న చిత్రంలో అలీరెజాకు మంచి పాత్ర ఇస్తున్న‌ట్టు స‌మాచారం. ఎట్ట‌కేల‌కు నాగార్జున చొర‌వ‌తో అలీరెజా త‌న జీవితాశ‌యాన్నినెర‌వేర్చుకోబోతున్నాడ‌న్న మాట‌.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News