అంచనాలు రేపుతున్న క్రేజీ సీక్వెల్

By iDream Post Jul. 12, 2020, 12:32 pm IST
అంచనాలు రేపుతున్న క్రేజీ సీక్వెల్

చాలా పరిమిత బడ్జెట్ తో రూపొందే కన్నడ సినిమాల స్టాండర్డ్ కేజిఎఫ్ తర్వాత అమాంతం పెరిగిపోయింది. సరైన కంటెంట్ తో కొడితే శాండల్ వుడ్ మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో రెండు వందల కోట్లు రాబడతాయని అది ఋజువు చేశాక ఇతర నిర్మాతల్లోనూ బోలెడు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అందుకే ఖర్చు విషయంలో వెనుకడుగు వేయకుండా భారీ ప్రాజెక్టులు తీస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన అతడే శ్రీమన్నారాయణ తెలుగులో ఫెయిలైనప్పటికీ కర్ణాటకలో భారీ విజయం నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ వరసలో మరో సినిమా వచ్చి చేరుతోంది. అదే భజరంగి 2..

2013లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భజరంగికి కొనసాగింపుగా ఇది వస్తోంది. ఇందాకా ట్రైలర్ విడుదల చేశారు. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ కి ఇందులో భాగస్వామ్యం ఉండగా తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో రిలీజ్ చేయబోతున్నారు. కాకపోతే ఇప్పుడు మాత్రం ట్రైలర్ కన్నడ వెర్షన్ మాత్రం ఆన్ లైన్ లో వదిలారు. కథ డిటైల్డ్ గా కాకపోయినా చూచాయగా చెప్పేశారు. ఎప్పుడో పురాతన కాలానికి చెందిన ఓ ఆటవిక రాజ్యం. అక్కడ ఓ లేడీ డాన్ దే రాజ్యం. అరాచక శక్తులకు సామాన్యులు తలొగ్గి బానిసలుగా మగ్గుతూ ఉంటారు. అక్కడ ఎప్పుడూ చూడని భయానక వాతావరణం ఉంటుంది. అక్కడ అడుగు పెడతాడు హీరో. అతను ఏం చేశాడు అక్కడికి ఎలా చేరుకోగలిగాడు అనేదే మెయిన్ పాయింట్ లా కనిపిస్తోంది.

స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా, మహాత్మా, ఒంటరి లాంటి సినిమాల ద్వారా మనకూ పరిచయమున్న భావన హీరోయిన్ గా డిఫరెంట్ రూపంలో కనిపించడం విశేషం. సీనియర్ నటి శృతి మంచి మాస్ విలన్ లుక్స్ లో భయపెట్టేశారు. ఈవిడ ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం తెలుగులో పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ హీరొయిన్ గా చేసినావిడే. మొత్తానికి మంచి ఇంటెన్సిటీతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. కేజిఎఫ్ తరహాలో హీరోయిజం బాగా ఎలివేట్ చేసినట్టు కనిపిస్తోంది.విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తున్న సూపర్ న్యాచురల్ ఫాంటసీ మూవీ భజరంగి 2కి దర్శకుడు హర్ష.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp