విడుదల తేదీలు వచ్చేస్తున్నాయి

By iDream Post Jun. 15, 2021, 05:00 pm IST
విడుదల తేదీలు వచ్చేస్తున్నాయి
థియేటర్లు తెరుచుకునే సూచనలు దగ్గరలోనే ఉన్నా కూడా నిర్మాతలు తేదీలు ప్రకటించేందుకు మాత్రం జంకుతున్నారు. ఇప్పుడు అనౌన్స్ చేశాక తీరా అప్పుడు పరిస్థితులు బాలేకనో లేదా యాభై శాతం ఆక్యుపెన్సీ వర్కవుట్ కావడం లేదన్న భయం చేతనో మళ్ళీ వాయిదా వేస్తే అనవసరంగా ఓటిటి గురించి ఆలోచించాల్సిన టెన్షన్ వచ్చి పడుతుంది. అందుకే ఇంకో రెండు మూడు వారాలు ఆగి కానీ ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని టాలీవుడ్ నిర్మాతలు డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ హాళ్లు ఓపెన్ చేస్తే ఎన్ని తక్కువ సీట్లున్నా సరే తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు చిన్న ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్న మాట వాస్తవం.

గత ఏడాది ట్రెండ్ కి భిన్నంగా ఈ సారి మొదటి ప్రకటన బాలీవుడ్ నుంచి వచ్చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన బెల్ బాటమ్ జులై 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచే చెప్పేశారు. సో డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ ప్రచారానికి చెక్ పెట్టినట్టే. నెల రోజుల క్రితం ఈ బెల్ బాటమ్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని త్వరలోనే స్ట్రీమింగ్ చేస్తారని ఏదేదో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడదంతా అబద్దమని తేలిపోయింది. సల్మాన్ ఖాన్ రాధే రిజల్ట్ ని చూశాక మేకర్స్ ఓటిటి రిలీజుల పట్ల అంత ఆసక్తి చూపించడం లేదు. దానికి సాక్ష్యంగా దీన్ని చెప్పుకోవచ్చు

ఇప్పుడిది అందరూ ఫాలో కావాల్సిన అవసరం చాలా ఉంది. లేనిపోని భయాలు మనసులో పెట్టుకుని కరోనా గురించే టెన్షన్ పడుతూ రిలీజులు వాయిదా వేసుకుంటూ పోతే అంతుపొంతు ఉండదు. అసలే ల్యాబుల్లో ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న సినిమాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇమేజ్ ఉన్న హీరోలవి ఎప్పుడైనా మార్కెట్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు. కానీ బడ్జెట్ చిత్రాల పరిస్థితి అలా కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఓటిటి సంస్థలు బేరాల దగ్గర ఫుట్ బాల్ ఆడుకుంటాయి. మరి బెల్ బాటమ్ ని ఇన్స్ పిరేషన్ గా తీసుకుని ఇంకెన్ని ప్రకటనలు వస్తాయో చూడాలి. దీనికన్నా ఎక్కువగా అందరి కళ్ళు సూర్యవంశీ మీద ఉన్నాయి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp