ప్రేక్షకుల ముందుకి పడగ్గది కథలు
స్త్రీ పురుష సెక్స్ సంబంధాలని ఒకప్పుడు బూతు అని పిలిచేవారు. పడగ్గది కథలు సినిమాల్లో చూపించేవారు కాదు. ఒకవేళ చూపినా చాలా మర్మగర్భంగా చూపేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. హిందీ వెబ్‌సిరీస్, సినిమాల్లో ఇవే హిట్టు కథలు.
1965లో సుమంగళి (ఏఎన్ఆర్, సావిత్రి) వచ్చింది. నిజానికి ఇది శారద (1962 తమిళ సినిమా), సుహాగన్ (1964 హిందీ)లకు రీమేక్. ఒక ప్రమాదం వల్ల హీరో సెక్స్‌కు పనికిరాకుండా పోతే హీరోయిన్ ఆవేదన కథే ఇతివృత్తం. ఇదే కథతో 1982లో తరంగణి వచ్చింది. హీరో సుమన్ అనారోగ్యంతో సెక్స్‌కి అశక్తుడైతే అతని స్నేహితుడు భానుచందర్ హీరోయిన్ని లొంగిదీసుకోవడానికి ప్రయత్నించే కథ.
1977లో దాసరి దర్శకత్వంలో వచ్చిన బంగారక్కలో శ్రీదేవి హీరోయిన్. స్త్రీలలో ఉన్న ఫ్రిజిడిటి కథావృత్తంగా వచ్చిన తొలి సినిమా. అదే ఏడాది వచ్చిన "అందమే ఆనందం"లో కూడా కథ ఇదే. ఈ రెండు సినిమా నిర్మాతల మధ్య ఈ కథ గురించి గొడవ జరిగినట్టు గుర్తు.
ఆ తర్వాత తెలుగులో ఈ కథా వస్తువుపై పెద్దగా ప్రయోగాలు జరగలేదు. ఈ మధ్య హిందీలో దూసుకుపోతున్నారు. లస్ట్ స్టోరీస్ వెబ్‌సిరీస్ పెద్ద హిట్. దీన్ని తెలుగులో తీయబోతున్నారు.
"శుభ్మంగళ" సినిమా కూడా హీరో సెక్స్ సమస్యపై తీసిందే. హఠాత్తుగా ఒక కుర్రాడికి తాను సెక్స్‌కి పనికిరాననే అనుమానం వస్తే ,అతని కాబోయే భార్య ఈ సమస్యను ఎలా పరిష్కరించిందనేది కథ.
"బడాయియో" సినిమా కొంచెం డిఫరెంట్. కొడుక్కి పెండ్లి చేయాల్సిన వయస్సులో తల్లి గర్భవతి అయితే ఆ కుటుంబంలో ఏం జరిగిందనేది కథ. ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాయి. సినిమా మారితే ప్రేక్షకులు మారుతారు.


Click Here and join us on WhatsApp to get latest updates.