రవితేజ భలే టైటిల్ పట్టేశారే

By iDream Post Jul. 12, 2021, 11:30 am IST
రవితేజ భలే టైటిల్ పట్టేశారే

క్రాక్ తర్వాత ఖిలాడీ పూర్తి చేసిన మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాకు రామారావు టైటిల్ ని ఖరారు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆన్ డ్యూటీ అనే ట్యాగ్ లైన్ కూడా జోడించారు. ఇందులో హీరో పాత్ర రెవిన్యూ లేదా రిజిస్టర్ ఆఫీసర్ లో ప్రభుత్వ ఉద్యోగి కావడం దానికి తగ్గట్టుగా ఇది ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. రామారావు అనేది పాత తరం పేరైనప్పటికీ నందమూరి ఫ్యాన్స్ కు అదో ఎమోషన్. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరుని ఇలా కమర్షియల్ సినిమాకు వాడుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది బాలయ్య అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సైతం ఆకట్టుకునేదే

గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఒక కథ రాసుకుని దానికి రామారావు గారు అనే టైటిల్ ను అనుకున్నట్టు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అయితే ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ కాలేదు కానీ అదే కథతో అనిల్ బాలయ్య సినిమా చేస్తాడా లేక వేరే సబ్జెక్టు అనుకున్నారా అనేది మాత్రం బయటికి రాలేదు. మొత్తానికి అంచనాలు పెంచడంలో ఆసక్తి రేపడంలో రామారావు యూనిట్ సక్సెస్ అయ్యింది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు ఈ పాత్రను దర్శకుడు శరత్ మండవ డిజైన్ చేసినట్టు ఇప్పటికే టాక్ ఉంది. మొదటిసారి మాస్ రాజా సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందించనుండటం విశేషం.

ఇతని పనితనం విక్రమ్ వేదాలో ఏ స్థాయిలో పండిందో ఆ సినిమా చూసినవాళ్లకు గుర్తే. రామారావు షూటింగ్ ని జెట్ స్పీడ్ తో చేస్తున్నారు. ఖిలాడీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ ఇది కూడా ఈ ఏడాది వచ్చేలాగే ప్లానింగ్ జరిగింది. క్రాక్ తో కలిపి 2021లో రవితేజ సినిమాలు మొత్తం మూడు వస్తాయన్న మాట. ఒక్క నితిన్ కు మాత్రమే ఈ ఫీట్ సాధ్యమవ్వగా ఇంత కరోనా సెకండ్ వేవ్ ప్రభంజనంలోనూ రవితేజ స్పీడ్ చూస్తుంటే ముచ్చట వేయక మానదు. మజిలీ ఫేమ్ దివ్యాన్షు కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న రామారావులో కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుందట

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp